హిమాయత్ సాగర్ సౌడమ్మ దేవాలయంలోకి చొరబడ్డ దొంగల ముఠా

రంగారెడ్డీ జిల్లా రాజేంద్రనగర్ లో రెచ్చిపోయారు దుండగులు. హిమాయత్ సాగర్ సౌడమ్మ దేవాలయం లోకి చొరబడ్డారు దొంగల ముఠా. దేవాలయంలో ఉన్న అమ్మవారి హుండీ పగలగొట్టడానికి విఫల యత్నం చేశారు. రెండు గంటల పాటు తీవ్రంగా శ్రమించారు ముగ్గురు దుండగులు. హుండీ తాళాలు తెరుచుకోక పోవడంతో పక్కనే ఉన్న కిరాణా షాప్ లోకి దూరారు దుండగులు.

షాప్ లో ఉన్న కొంత డబ్బు తో పాటు సామాగ్రి దొంగిలించారు. సి.సి కెమెరాలు చూసి వాటిని ధ్వంసం చేసి పారిపోయారు ముఠా సభ్యులు. సౌడమ్మ దేవాలయంలో సి.సి టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి దొంగల దృశ్యాలు. రెండు గంటల పాటు దేవాలయం హుండీ పగల గొట్టడానికి యత్నించారు. రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దేవాలయ పూజారి. సి.సి టివి ఫూటెజ్ అదారంగా పొలీసులు దర్యాప్తు ప్రారంబించారు.