కోర్టు నుంచి హత్యాచారం కేసు నిందితుడు పరారీ.. కొట్టి చంపిన స్థానికులు

ఓ యువతిపై అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను దారుణంగా హత్య చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పోలీసులు అతణ్ని కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్లారు. సందు చూసి అక్కణ్నుంచి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి ఊరూరా తిరుగుతూ ఓ గ్రామానికి చేరుకున్నాడు. తెలిసిన వారు కనిపించడంతో ఓ వాగు వద్ద దాక్కున్నాడు. కానీ గమనించిన స్థానికులు అతడిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి చంపారు. ఈ ఘటన అసోం రాష్ట్రంలో చోటుచేసుకుంది.

హత్యాచారం కేసులో నిందితుడిని కొట్టి చంపారు స్థానికులు. ఈ ఘటన అసోంలోని లఖింపుర్​లో గురువారం రోజున జరిగింది. రెండు రోజుల క్రితం గెర్జాయ్ బారువా అలియాస్ రాజు బారువా కోర్టు నుంచి తప్పించుకున్నాడు. అనంతరం అతడు ఘిలామార్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిలకిలి గ్రామంలోని ఓ వాగు వద్ద దాక్కున్నాడు. దీంతో స్థానికులు కొంత మంది కలిసి అతడిపై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.