ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీనే గెలుస్తుంది : మంత్రి రోజా

ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మా పార్టీయే గెలుస్తుందని, జగనే ముఖ్యమంత్రి అవుతారని ఏపీ సాంస్కృతికశా‌ఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అని చెప్పారు మంత్రి రోజా. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని, అవినీతి రహిత పాలన అందిస్తూ ప్రజల్లో ప్రత్యేకస్థానం సంపాదించుకున్నామని పేర్కొన్నారు మంత్రి రోజా. అవినీతికి తావు లేకుండా, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న జగన్ పాలనకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామికాభివృద్ధిపై, తమ ప్రభుత్వంపై నారా లోకేశ్ విషం చిమ్ముతున్నారని… ఆయనకు అభివృద్ధి కనపడలేదంటే నేత్ర వైద్యుడిని కలవాలని సూచించారు.

Andhra Pradesh: RK Roja quits movies and Jabardasth show amid inducting  into the cabinet

ఇచ్చిన హామీలన్నింటిని జగన్ తీరుస్తున్నారని మంత్రి రోజా వెల్లడించారు. ఇదే సమయంలో బాలకృష్ణపై కూడా రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహిళల గురించి గతంలో ఆయన ఎన్నో మాట్లాడారని… ఆయనపై అప్పట్లో చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు మంత్రి రోజా. పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగారు. అమావాస్యకో, పౌర్ణమికో ఒకసారి వచ్చి బాలకృష్ణ మాట్లాడుతుంటారని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. అంబానీ, అదానీలు ఏపీ వైపు చూస్తుంటే… టీడీపీ మాత్రం ప్రభుత్వంపై బురదచల్లే పని చేస్తోందని విమర్శించారు మంత్రి రోజా.