గోడపై మూత్రం పోశాడని హత్య

ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకు కూడా చావే జవాబు అనుకుంటున్నారు కొందరు. అది ఆత్మహత్య అయినా.. హత్య అయినా.. వీటికి సంబంధించిన ఏ నిర్ణయమైనా చాలా సులువుగా తీసుకుంటున్నారు. సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. ముఖ్యంగా ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం వచ్చినా హత్య చేయడానికి కూడా వెనకాడట్లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని మాలవీయ నగర్ లో ఓ ఇంటి కూడా వద్ద మయాంక్ అనే యువకుడు మూత్రం పోశాడు.

అది చూసిన ఆ ఇంటి మహిళ మయాంక్ ని ప్రశ్నించింది. తాను చేసింది అంత పెద్ద తప్పేం కాదంటూ మాయాంక్ తిరిగి వాదనకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాట, మాట పెరిగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహిళ కుమారుడు మనీష్ ని మయాంక్ ని కొట్టాడు. దీంతో ఆగ్రహించిన మనీష్ స్నేహితులతో కలిసి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మయాంక్ ను కత్తులతో పొడిచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.