హైదరాబాద్ లో దారుణాలు..ఓయో రూంలో శృంగారం చేస్తూ !

-

హైదరాబాద్ లో దారుణ ఓయో హోటల్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాన్ని యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ బృందం గుట్టు రట్టు చేసింది. ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా, ఆరుగురు యువతులను రెస్క్యూ హోం కు తరలించనున్నారు.

గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిన్న అంజయ్య నగర్ లోని ఎంపైర్ ఓయో హోటల్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాకింగ్ యూనిట్ బృందం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు దాడి చేశారు.

ఉజబెక్కిస్తాన్ కు చెందిన యువతి తో పాటు ఇద్దరు ఢిల్లీ, ఇద్దరు వెస్ట్ బెంగాల్, ఒకరు ముంబైకి చెందిన యువతులకు విముక్తి కలిగించారు. ఘటనా స్థలంలో 6 సెల్ ఫోన్లు, 38 కండోమ్ ప్యాకెట్లు, రూ. 81,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యువతులను రెస్క్యూ హోంకు తరలించనున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news