నడ్డురోడ్డుపై ఓ యువకుడిని కొందరు దుండగులు విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చిన ఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం చోటు చేసుకుంది. పట్ట పగలు నడిరోడ్డుపై వాహనదారులు చూస్తుండగానే.. యువకుడు ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలకు గురైన సదరు యువకుడు సాయినాధు అక్కడక్కడే మృతి చెందాడు.
అయితే, ఈ సంఘటన జియాగూడలో జరుగగా, కేసును ఇవాళ చేధించారు పోలీసులు. సాయినాధుని చంపిన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..సాయినాథ్ స్నేహితులే నరికి చంపినట్లుగా గుర్తించారు. ఆర్థిక కారణాలతోనే సాయినాధుని చంపినట్టుగా తేల్చిన పోలీసులు… అక్షయ్, టిల్లు, సోను హత్య చేసినట్లగా నిర్ధారించారు.