రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

రాజేంద్రనగర్ సన్ సిటీ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు మోటార్ సైకిల్ ని ఢీకొట్టడంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు రోడ్డుకు చివరి నుండి వెళుతున్న మోటర్ సైకిల్ ను ఢీ కొట్టింది.

10 మీటర్ల దూరం రోడ్డు పై ఈడ్చుకుంటూ వెళ్లింది మోటర్ సైకిల్. మహిళ తలకు తీవ్రమైన గాయం కావడంతో స్పాట్ లో మృతి చెందింది. ఆమె భర్త కు తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. భర్త ముందే భార్య మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నార్సింగీ పోలీసులు.