భార్యభర్తల మధ్య గొడవకు సవతి కుమారుడు బలి.. ట్విస్ట్‌ ఏంటంటే..

తల్లిదండ్రులు ప్రవర్తన బట్టే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది..సంసారం అన్నాక.. భార్యభర్తలు గొడవపడటం సాధారణమైన విషయమే.. కానీ ఆ గొడవ కొంతవరకే ఉండాలి.. చాలామంది.. ఈ గొడవల వల్ల విసిగిపోయి.. అయితే వాళ్లు చచ్చిపోతారు.. లేదా తమ పార్టన్‌రు చంపేతారు. ఇంకో కేసులో వీళ్లతోపాటు వారికి ఉన్న పిల్లలను కూడా చంపేస్తారు.. నేడు సమాజంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మాత్రం భార్యభర్తలు గొడవలకు పసిప్రాణాలు బలయ్యాయి.. సవితి కుమారుడిని హత్య చేసింది ఓ మహిళ.. ఒడిశాలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

మొదటి భార్య మరణించడంతో.. 2021లో రెండో పెళ్లి చేసుకున్నాడు ఓ వ్యక్తి. మొదటి భార్య సంతానంతో కలిసి రెండో భార్యతో.. కటక్​ మధుపట్న పోలీస్​ స్టేషన్​ పరిధిలోని శ్రీరామ్​ నగర్​లో జీవితం సాగించాడు. కానీ రెండో భార్యతో ఆ వ్యక్తికి పడలేదు! వారిద్దరి మధ్య నిత్యం గొడవలు జరిగేవి. కలహాల కాపురం..నిత్య గొడవలమయంగా మారింది..గొడవలను తట్టుకేలక.. ఎనిమిది నెలలుగా భార్యకు దూరంగా వేరే ఇంట్లో నివాసం ఉంటున్నాడు ఆ వ్యక్తి…

ఈ క్రమంలోనే.. నాలుగు రోజుల క్రితమే భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవైంది. ఆ తర్వాత.. సోమవారం ఉదయం.. కత్తితో రెండేళ్ల సవతి కుమారుడి గొంతు కోసి హత్య చేసింది ఆ మహిళ. వరుసకు పినతల్లి అవుతుంది..అయినా ఆ కనికరం లేకుండా.. చిన్నపిల్లాడు అని కూడా చూడకుండా ఈ దారుణానికి ఒడిగట్టింది.. కొద్దిసేపటికే.. ఉరేసుకుని తాను కూడా ప్రాణాలు తీసుకుంది.

సోమవారం ఉదయం.. ఆ మహిళ తలుపు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు.. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. డోరు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లిన కుటుంబసభ్యులకు.. రక్తపుమడుగులో పడి ఉన్న రెండేళ్ల బాలుడి మృతదేహం కనిపించింది. అక్కడే ఉన్న ఓ గదిలో.. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్టు వివరించారు.

సవతి కుమారుడిని ఆ మహిళ ఎందుకు చంపింది? తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అన్న ప్రశ్నలకు పోలీసుల వద్ద ప్రస్తుతం సరైన సమాధానం లేదు. కాగా.. భర్తతో గొడవల వల్లే మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.. ఆదివారం రాత్రి.. ‘ఐ క్విట్​’ అని తన ఫేస్​బుక్​ ఖాతాలో ఆ మహిళ పోస్ట్​ చేసిన విషయం పోలీసులకు తెలిసింది.

“నా భర్యతో నాకు సుఖం లేదు. ఎప్పుడూ గొడవపడుతూనే ఉంటుంది. విడాకులు ఇద్దామని అనుకున్నాను. విడాకుల ప్రస్తావన తెస్తే.. నా కొడుకును చంపేస్తానని బెదిరించింది. నా తల్లిండ్రులతో బంధం తెంచుకోవాలని ఒత్తిడి చేసేది. కానీ నేను అలా చేయకపోవడంతో నా మీద కక్ష పెంచుకుంది. ఆమె ప్రవర్తనపై నేను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాను. ఇంత దారుణపని చేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు,” అని మహిళ భర్త చెప్పుకొచ్చాడు..

మరోవైపు.. ఈ పూర్తి వ్యవహారంలో మహిళ భర్తపై అనుమానం ఉన్నట్టు.. అతడి వేధింపుల వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్టు.. చనిపోయిన మహిళ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

ఏది ఏమైనా.. రెండు ప్రాణాలు పోయాయి.. ఆ మహిళకు రెండేళ్ల బాలుడిని చంపే హక్కు ఎవరు ఇచ్చారు.. పెద్దోళ్ల గొడవలకు చిన్నపిల్లాడు బలైపోయాడు.. పిల్లలు ఉండి రెండో పెళ్లి చేసుకునే ముందు స్త్రీలైనా, పురుషులైనా చాలా జాగ్రత్తగా ఉండాలి.. అసలు చేసుకోకపోవడమే మంచిది.. కన్నవారికి బిడ్డలపై ఉన్నంత ప్రేమ బంధం ద్వారా వచ్చిన వారికి ఉంటుందన్న గ్యారెంటీ లేదు.. ఇలా చేసుకోని.. ఆ పసిహృదయాలతో ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడం ఎంతవరకూ కరెక్ట్‌..?