పక్కింటి కుర్రాడితో పారిపోయిన భార్య, భర్త చేసిన పనికి అందరూ షాక్?

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా   ఓ మహిళ పొరుగింటి వ్యక్తి మాయలో పడిపోయి చివరికి భర్త పిల్లలను కాదని అతనితో పారిపోయింది. దీంతో ఎంతగానో మనస్థాపం చెందిన భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఈ దారుణమైన ఘటన హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్ బుద్దు నగర్ జిల్లా నివాసి అయినా కవీందర్ గురుగ్రామ్ లో ఓ గ్రామంలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ప్రైవేట్ కంపెనీలో పని చేయడంతో పాటు, క్యాబ్ నడుపుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. అయితే ఇటీవలే అతని భార్య అయినా పొరుగింటి వ్యక్తి రామ్ వీర్ తో కలిసి పారిపోయింది. భార్య కనిపించకపోవడంతో కవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు రామ్ వీర్ తో కలిసి రీనా పారిపోయింది అన్న విషయాన్ని తేల్చారు. భార్య చేసిన పనికి కవిందర్ తీవ్ర మణస్తాపం చెందాడు. భార్య ప్రాణంగా బ్రతికిన అతను చివరికి భార్య వేరొకరితో పారిపోవడానికి పారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. చివరికి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న కవిందర్ ను గమనించిన సోదరుడు సంతోష్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాగా, అప్పటికే మరణించినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కవిందర్ సోదరుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.