BREAKING : కంటి వెలుగు శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎస్‌ శాంతి కుమారి

-

ఏ.వీ. కళాశాలలో నిర్వహిస్తున్న కంటివెలుగు కార్యక్రమ శిబిరాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేటి నుండి దాదాపు వంద రోజుల పాటు కొనసాగే కంటివెలుగు కార్యక్రమంలో ప్రపంచరికార్డు సాధించేలా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎస్‌ శాంతి కుమారి పేర్కొన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి 15,000 మంది వైద్య, ఆరోగ్య సిబ్బందితో కూడిన 1,500 బృందాలు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12,768 శిబిరాలు, పట్టణ ప్రాంతాల్లో 3,788 శిబిరాలలో కంటి పరీక్షలు నిర్వహిస్తాయని సీఎస్‌ శాంతి కుమారి పేర్కొన్నారు.

ఈ శిబిరాల్లో ప్రత్యేక సాఫ్ట్ వేర్ సహాయంతో నాణ్యమైన కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని సీఎస్‌ శాంతి కుమారి వెల్లడించారు. అంతేకాకుండా.. అవసరమైన వారికి అక్కడికక్కడే రీడింగ్ అద్దాలను అందచేయడం జరుగుతుందని సీఎస్‌ శాంతి కుమారి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నిర్ధారిత ప్రాంతాల్లో నేడు కంటి వైద్య పరీక్షలు ప్రారంభమయ్యాయని శాంతి కుమారి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news