గ్రూప్ 4 నియామ‌క ప్ర‌క్రియ‌పై సీఎస్ సోమేశ్ సమీక్ష

-

గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్ 4 నోటిఫికేషన్లను కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గ్రూప్ – 4 పోస్టుల నియామ‌క ప్ర‌క్రియ‌పై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి టీఎస్‌పీఎస్సీ చైర్మ‌న్ జ‌నార్ధ‌న్ రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

Telangana Chief Secretary clarifies on imposition of lockdown, says  everything is under control

గ్రూప్ – 4 ప‌రిధిలో ఖాళీగా ఉన్న‌ 9,618 పోస్టుల భ‌ర్తీ ప్ర‌క్రియ‌పై చ‌ర్చించారు. ఈ నెల 29వ తేదీ లోపు టీఎస్‌పీఎస్సీకి వివ‌రాలు పంపాల‌ని అన్ని శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌కు సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్ప‌టికే గ్రూప్ -1తో పాటు పోలీసు కానిస్టేబుల్స్, ఎస్ఐ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ ఉద్యోగాల‌కు అర్హులైన అభ్య‌ర్థులు చ‌దువుల్లో నిమ‌గ్న‌మైపోయారు. ఇక గ్రూప్-4 నోటిఫికేష‌న్ కూడా త్వ‌ర‌లోనే వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news