గ్రూప్ IV నోటిఫికేషన్‌ల జారీకి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్, IAS స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు అన్ని శాఖల అధిపతులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రూప్ IV కేడర్ కింద త్వరలో 9,168 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు ఇప్పటికే ప్రకటించారని ఈ సందర్భం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ వెల్లడించారు.
గ్రూప్ I కింద 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రక్రియను ప్రారంభించింది… పోలీసు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యా శాఖకు కూడా పోస్ట్ ల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చాము.. టెట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని.. రోస్టర్ పాయింట్లు, సంబంధిత సమాచారాన్ని ఈ నెల 29వ తేదీలోగా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అందజేయాలన్నారు.
మంజూరైన అన్ని జూనియర్ అసిస్టెంట్ , తత్సమాన పోస్టులను చేర్చి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలి.. సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్‌లలోని ప్రమోషనల్ ఖాళీలను కూడా భర్తీ చేయాలని ఆదేశించారు. HoDలు వారి వ్యక్తిగత దృష్టిని పెట్టాలి, తద్వారా ప్రక్రియ సమయాన్ని తగ్గించాలని తెలిపారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్.