ఏపీ రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రైతులకు ఖరీఫ్ సీజన్ కు ముందుగానే నీరు అందిస్తున్నామని హోం మంత్రి తానేటి వనిత ప్రకటించారు. ఈ మూడూ సంవత్సరాల కాలంలో వర్షాలు బాగా పడ్డాయి.. రైతులకు వ్యవసాయం సులభతరం అయిందన్నారు. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు తో రైతులకు సాయం అందుతుందని.. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
26 తేదీన శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు బస్సు యాత్ర ప్రారంభం అవుతుందని.. శ్రీకాకుళం, రాజమండ్రి, నరసరావు పేట అనంతపురం లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మీటింగ్ లో వచ్చిన సమస్యలు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని.. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం అన్నారు. అందరి సహకారంతో జిల్లాను ముందుండి నడిపించాలి.. పాత కృష్ణ జిల్లాకు మంచి పేరుంది.. ఇపుడు అదే రితిలో ఎన్టీయార్ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు హోం మంత్రి తానేటి వనిత.