చెన్నై పగ్గాలు ధోనీ చేతికి వచ్చిన ఉత్సాహంతో సీఎస్‌కే జట్టు వీర విధ్వంసం సృష్టించింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు శివతాండవం ఆడారు. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (99), కాన్వే (85 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ బౌండరీల వర్షంతో 99 పరుగుల వద్ద అవుటయ్యాడు. మరో ఓపెనర్ డివాన్ కాన్వే హాఫ్ సెంచరీతో రాణించడంతో 200 మార్క్ స్కోర్ సాధ్యమైంది.
టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో బ్యాటింగ్‌కి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్లు ఆది నుంచే బౌండరీలతో విరుచుకు పడ్డారు. దాంతో చెన్నై ఓవర్‌కి పది రన్ రేట్ తగ్గకుండా ఆడుతూ 20 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 6 సిక్సర్లు, 6 ఫోర్లతో 99 పరుగులు చేసి నటరాజన్ బౌలింగ్‌లో అవుటవ్వగా.. కాన్వే 55 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.