గ్రూప్‌-1 అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసిన TSPSC

-

గ్రూప్‌-1 ఉద్యోగల భర్తీ కొరకు ఇటీవల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలసిందే. అయితే తాజాగా.. గ్రూప్‌-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది TSPSC. గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు TSPSC వెబ్‌సైట్ www.tspsc.gov.inని సందర్శించి, సూచించిన ప్రొఫార్మాలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని TSPSC సూచించింది.

TSPSC Group 1 Syllabus, Material, Books and Tips – SmartPrep.in

అంతేకాకుండా దరఖాస్తు ఫారమ్‌లో భాగంగా OTR నుండి డేటా తీసుకోబడుతుంది కాబట్టి, ఇంకా తమ OTRను సవరించని అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు ఎడిట్ చేసుకోవాలని తెలిపింది. అభ్యర్థులు ముందుగా OTR లోని తమ సమాచారం అప్‌డేట్ చేయబడిందని, ఖచ్చితమైనదని నిర్ధారించుకోవాలని సూచించింది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారమ్, యూజర్ గైడ్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండవద్దని TSPSC పేర్కొంది.

 

Read more RELATED
Recommended to you

Latest news