10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే స్కోర్‌ ఇలా

-

క్రికెట్‌ ప్రియులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నాలుగు సంవత్సరాల తర్వాత స్వదేశంలో జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో ప్రారంభ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు తలపడనున్నాయి. అయితే.. గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహిస్తుండగా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు మహేంద్ర సింగ్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నారు. అయితే. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో.. సీఎస్కే ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్ తన బ్యాట్‌తో చెలరేగాడు.

 

హార్దిక్ వేసిన తొలి ఓవ‌ర్‌లో రెండు బౌండ‌రీలు కొట్టాడు. దాంతో, 11 ప‌రుగులు వ‌చ్చాయి. డెవాన్ కాన్వే(1), రుతురాజ్(11) క్రీజులో ఉన్నారు. రెండు ఓవ‌ర్ల‌కు సీఎస్కే 13 ర‌న్స్ చేసింది. ష‌మీ వేసిన తొలి ఓవ‌ర్‌లో కేవ‌లం రెండు ప‌రుగులు స్కోర్‌ చేయగలిగింది సీఎస్కే. అయితే.. గుజ‌రాత్ టైట‌న్స్ బౌల‌ర్ ష‌మీ బిగ్ సీఎస్కే ఓపెనర్‌ డెవాన్ కాన్వే(1)ను బౌల్డ్ చేశాడు. రెండో ఓవ‌ర్ మొద‌టి బంతికే కాన్వేను పెవిలియ‌న్ పంపాడు షమీ. దాంతో, 16వ సీజ‌న్‌లో తొలి వికెట్‌ను షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసే సరికి సీఎస్‌కే స్కోర్‌: 93/3. క్రీజులో రుత్‌రాజ్‌(57), రాయుడు(3) పరుగులతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version