ఏపీ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చేందుకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ సన్నద్ధం అవుతోంది. మార్చి నెల నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఏపీ సర్కార్. ఈ మేరకు ప్రజలను ప్రిపేర్ చేసి.. ఛార్జీలను పెంచనున్నారు. విద్యుత్ చార్జీలు పెంచాలంటే.. ఏపీఈఆర్‌సీ అనుమతి కచ్చితంగా ఉండాలి. దీనికి చైర్మన్‌గా నాగార్జున రెడ్డి ఉన్నారు.
ఆయన మీడియా సంస్థలకు పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు తప్పని.. విద్యుత్ చార్జీల పెంపు ఉంచకూడదనే మైండ్ సెట్ నుంచి ప్రజలు బయటకు రావాలని సూచిస్తున్నారు. అంటే విద్యుత్ చార్జీలు పెంచుతారు.. భరించాలని ఆయన ఇప్పటి నుంచే సూచనలు చేస్తున్నారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్ ఇటీవల ట్రూప్ అప్ చార్జీల పేరుతో ప్రజల వద్ద నుంచి అదనపు చార్జీలు వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇక ఇప్పుడు నేరుగా చార్జీల పెంపు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయసేకరణ చేస్తున్నారు. చార్జీల పెంపు ఖాయమని ముందుగానే చెబుతున్నారు.