ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం కరెంట్ కోతలు అమలు అవుతున్నాయి. డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంట్ కోతల కారణంగా చంటిపిల్లలు, తల్లులు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. చివరకు సెల్ ఫోన్ల వెలుగుల్లో ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అన్నదాతకు కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కరెంట్ కోతలపై స్పందించారు. కొద్ది రోజుల్లో కరెంట్ సమస్య చక్కబడుతుందని ఆయన తెలిపారు. తీవ్రమైన బొగ్గు కొరత కారణంగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు పూర్తిస్థాయిలో నడవడం లేదని.. 38 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా విద్యుత్ డిమాండ్ 1.4 శాతం పెరిగిందని.. దీంతో కరెంట్ కోతలు దేశవ్యాప్తంగా ఉన్నాయన్నారు. గుజరాత్, మహారాష్ట్ర తో సహా 14 రాష్ట్రాల్లో లోడ్ షెడ్డింగ్ తప్పడం లేదని వెల్లడించారు. కొద్ది రోజుల్లోనే విద్యుత్ సమస్యలకు చెక్ పడుతుందని ట్విట్ చేశారు.