నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. కాంగ్రెస్‌ సంస్థాగత వ్యవహారాలపై చర్చ

-

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం నేడు జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రేపు ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై సిడబ్ల్యూసిలో చర్చ జరగనుంది. అక్టోబర్ 2 నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించాలని తొలుత నిర్ణయం తీసుకున్నా.. తదుపరి సెప్టెంబర్ 7కు మార్పు చేశారు. ఆగస్టు 28న అధిక ధరలకు వ్యతిరేకంగా రాంలీలా మైదానంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

మొత్తం 3571 కిలోమీటర్ల మేర భారత్ జోడో యాత్ర జరగనుంది. 68 లోకసభ నియోజకవర్గాలు, 203 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. కన్యాకుమారి నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని ఆలూరు, తెలంగాణలోని వికారాబాద్ గుండా జమ్మూ వరకు 20 ప్రధాన నగరాలు, పట్టణాలు గుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగనుంది. తెలంగాణలో 17 రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కొనసాగనుంది. ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం 100 కిలోమీటర్ల మేరకు 4 రోజుల పాటు రాహల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర సాగనుంది. ఏపీలో రెండు లోకసభ నియోజకవర్గాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల గుండా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version