దళితులు, గిరిజనుల అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న చారిత్రాత్మక కృషిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్‌కుమార్ కానుగోలు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశ్యపూర్వకంగా మభ్యపెట్టారని బీఆర్‌ఎస్ హైదరాబాద్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఆరోపించారు. తెలంగాణలో ఎస్సీ/ఎస్టీ సాధికారత పథకాలు అమలవుతున్నాయి అని అన్నారు ఆయన.
చేవెళ్లలో కాంగ్రెస్ ప్రకటించిన ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్‌పై స్పందిస్తూ, “అది డిక్లరేషన్ కాదు, నిరాశ” అని ఖర్గే టూర్ ప్రచారం కూడా చేయలేదన్నారు. ఎస్సీ/ఎస్టీ ప్రజలను కాంగ్రెస్ దూరం చేసింది. కాంగ్రెస్ హయాంలో పోడు భూములను ఎందుకు పంపిణీ చేయలేదని, కేసీఆర్ దానిని విజయవంతంగా అమలు చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో కాంగ్రెస్ ఎందుకు విఫలమైందని శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు. ఖర్గేను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ఉన్న డొల్లతనం ఖర్గేకు తెలిసేలా ఓపెన్ లెటర్ రాస్తున్నట్లు చెప్పారు.