బాడీలో క్రోమియం లోపిస్తే డయబెటిస్, పీసీఓఎస్‌ పేషంట్లకు ప్రమాదమే..

-

చాలమందికి క్రోమియం అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు.. ఇది అసలు మన శరీరంలో ఉంటుందని కూడా ఊహించరమో కదా.. క్రోమియం లోపం వల్ల పెద్ద పెద్ద సమస్యలు ఏంరావు కానీ..క్రోమియం అనేది తగిన స్థాయిలో ఉంటేనే డయాబెటిస్, పీసీఓఎస్ వంటి పేషెంట్లలో పరిస్థితి మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు సూచించాయి. క్రోమియం మన శరీరంలో ప్రొటీన్ జీవక్రియను మెరుగుపరిచి ఇన్సులిన్ చర్యను ప్రోత్సహిస్తుంది. అయితే క్రోమియం లోపంతో అసాధారణమైన అనారోగ్యాలు ఏవీ ఉండనప్పటికీ..క్రోమియం లోపం ఏర్పడినప్పుడు సంబంధిత ఆహారం తీసుకుంటే శరీరం అనారోగ్యం నుంచి తిరిగి పుంజుకుంటుందని పలు అధ్యయనాలు సూచించాయి.
డయాబెటిస్, పీసీఓఎస్ పేషెంట్లలో క్రోమియం సప్లిమెంట్లు పరిస్థితిని మెరుగుపరుస్తాయని అధ్యయనాల్లో తేలింది. అయితే అధిక సప్లిమెంట్లు అనర్థాలకు దారితీస్తాయని అధ్యయనం సూచించింది.

క్రోమియం లోపంతో ఈ అనారోగ్యం..

క్రోమియం లోపం కారణంగా నాడీ సంబంధిత సమస్యలు, హైపర్‌గ్లైసీమియా, బరువు కోల్పోవడం, పెరిఫెరల్ న్యూరోపతి, గ్లూకోజ్ నిరోధకత, గందరగోళం వంటి సమస్యలకు దారితీస్తుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే డయాబెటిస్ పేషెంట్లలో క్రోమియం లోపం కారణంగా ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువగా ఉంటున్నట్టు ఆయా అధ్యయనాలు స్పష్టం చేశాయి.
క్రోమియం సప్లిమెంట్లు ఇవ్వడం ద్వారా ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ మెరుగుపడ్డాయని తేలింది. అలాగే పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవడం, అధిక ట్రైగ్లైజరైడ్ స్థాయిలు, అధిక కొలెస్ట్రాల్ స్థాయి, హైపర్ టెన్షన్, ఫాస్టింగ్ షుగర్స్ ఎక్కువగా ఉండడం వంటి మెటబాలిక్ సిండ్రోమ్ సమస్యకు కూడా క్రోమియం సప్లిమెంట్లు పనిచేశాయని అధ్యయనం ద్వారా తేలింది.. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ కారణంగా గుండె జబ్బులు, డయాబెటిస్, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వీటన్నింటికి ప్రధాన కారణం ఇన్సులిన్ నిరోధకతే అని సంబంధిత అధ్యయనం సూచించింది.
క్రోమియం సప్లిమెంట్లు మెరుగైన ఫలితాలను ఇచ్చాయని ఆ అధ్యయనం తేల్చింది. అలాగే పీసీఓఎస్ పేషెంట్లలో కూడా క్రోమియం సప్లిమెంట్లతో గ్లూకోజ్ నియంత్రణ, లిపిడ్ లెవెల్స్ మెరుగుపడడం సాధ్యమైందని మరో అధ్యయనం ద్వారా తెలిసింది.

క్రోమియం తగ్గకుండా ఉండాలంటే..

శరీరంలో ఉన్న క్రోమియం నష్టపోకుండా ఉండాలంటే కూల్ డ్రింక్స్, సోడా, ఆల్కహాలు వంటి వాటికి దూరంగా ఉండాలి.
శాచ్యురేటెడ్ కొవ్వులు, సోడియం తగ్గించాలి.
నట్స్, గుడ్లు, తేలికైన మాంసాహారంలో క్రోమియం లభిస్తుంది.
సముద్ర చేపలు, బీన్స్, బఠానీ, పప్పులు, సోయా ఉత్పత్తుల్లో క్రోమియం లభిస్తుంది.
గ్రేప్స్, ఆరేంజ్, టమాటా, ఆపిల్, బీన్స్, అరటి పండు వంటి వాటిలో క్రోమియం లభిస్తుంది

Read more RELATED
Recommended to you

Exit mobile version