దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా కొనసాగుతోంది. వరసగా ఎయిర్ పోర్టులు, నౌకాశ్రయాల్లో డ్రగ్స్ పట్టుబడుతోంది. తాజాగా ఢిల్లీలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఏయిర్ పోర్టులో దాదాపుగా రూ. 434 కోట్ల విలువైన హెరాయిన్ డ్రగ్ ను అధికారులు పట్టుకున్నారు. అంతర్జాతీయ కార్గోలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. రూ.434 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్ చేశారు డీఆర్ఐ అధికారులు. ఉగాండా నుంచి ఢిల్లీ వచ్చిన పార్సిల్‌లో హెరాయిన్ గుర్తించారు. 126 ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్ ను స్మగ్లర్లు దాచారు. ఇటీవల మే6 న షార్జా నుంచి తమిళనాడు కోయంబత్తూర్ కు వచ్చిన ఓ మహిళ నుంచి కూడా భారీ స్థాయిలో పట్టుకున్నారు. ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులకు మహిళపై అనుమానం వచ్చి తనిఖీ చేయాగా… ఆమె శరీరంలో 81 క్యాప్సూల్స్ లో దాచిన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల్లో మెథాంఫేటమిన్ డ్రగ్స్ అని తేలింది. మరోవైపు పాకిస్తాన్ నుంచి సముద్రమార్గం ద్వారా.. పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా అక్రమార్కులు డ్రగ్స్ ను దేశంలోకి తరలిస్తున్నారు.