జై జ‌గ‌న్ : సీఎం..తుఫాను సాయం ఎంతంటే ?

-

అస‌ని తుఫాను నేప‌థ్యంలో ప్ర‌స్తుతం కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూనే తీర ప్రాంత ప్ర‌జ‌ల‌ను కాపాడేందుకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ వివ‌రించి వివ‌రాలు సేకరించారు. బాధిత ప్రాంతాల్లో అధికారులు గ్రౌండ్ లెవ‌ల్ లో వ‌ర్క్ చేయాల‌ని, ఏ ఒక్క‌రికీ ఇబ్బంది త‌లెత్త‌కుండా చూడాల‌ని అన్నారు. జిల్లాల వారీగా స‌మీక్షించిన ఆయ‌న కీల‌క సూచ‌న‌లు చేశారు. ముఖ్యంగా తీరం దాటే క్ర‌మంలో బాప‌ట్ల తో స‌హా ప‌లు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, గాలుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నందున ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని కోరారు.

తుఫాను సాయం అందించే క్ర‌మంలో ఎటువంటి వివ‌క్షా వ‌ద్ద‌ని హితవు చెప్పారు. స‌హాయ‌క శిబిరాల్లో త‌ల‌దాచుకుంటున్న కుటుంబాల‌కు ఆర్థిక సాయం కూడా డిక్లైర్ చేస్తూ ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చారు. స‌హాయ‌క శిబిరానికి త‌ర‌లించిన వ్య‌క్తికి వెయ్యి రూపాయ‌లు, తల‌దాచుకున్న ఒక్కో కుటుంబానికి త‌క్ష‌ణ సాయం కింద రెండు వేల రూపాయ‌లు ఇవ్వాల‌ని చెప్పారు. అదేవిధంగా తుఫాను తీరం దాటాక న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు, న‌ష్టాల అంచనాలు వెంట‌వెంట‌నే చేపట్టాల‌ని, వ్య‌వ‌సాయ రంగాన్ని ఆదుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం కోరారు. ఇప్ప‌టికే తుఫాను ప్ర‌భావిత ప్రాంతాల‌లో కంట్రోల్ రూంలు ఏర్పాటుచేశామ‌ని వాటిని ప్ర‌జ‌లు వినియోగించుకుని, ఈ విప‌త్తు నుంచి గ‌ట్టెక్కాల‌ని సూచించారు. ఏ చిన్న ఇబ్బంది వ‌చ్చినా త‌క్ష‌ణ ప‌రిష్కారానికే ప్రాధాన్యం ఇవ్వాల‌ని కోరారు.

కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు

కాకినాడ కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18004253077
కాకినాడ ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 0884-2368100
శ్రీకాకుళం: 08942-240557
తూర్పు గోదావరి: 8885425365
ఏలూరు కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 18002331077
విజయనగరం: 08922-236947
పార్వతీపురం మన్యం: 7286881293
మచిలీపట్నం కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252572
మచిలీపట్నంం ఆర్డీవో ఆఫీస్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 08672 252486
బాపట్ల కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 8712655878, 8712655881
ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌: 90103 13920
విశాఖ: 0891-2590100,102
అనకాపల్లి: 7730939383

Read more RELATED
Recommended to you

Latest news