బీజేపీ వరంగల్ సభకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే?

బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు చెల్లించిన గ్రౌండ్ రెంట్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి ఏసీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో అక్కడ కొద్దిసేపటి వరకు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

బండి సంజయ్-ప్రజాసంగ్రామ యాత్ర
బండి సంజయ్-ప్రజాసంగ్రామ యాత్ర

పోలీసు కక్ష్య సాధింపు చర్యలు చేపడుతున్నట్లు బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో కేసు వేయనున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 27వ తేదీన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా రానున్నారు. కానీ సభను పర్మిషన్ లేకపోవడంతో కాలేజీ గ్రౌండ్ ఇవ్వలేమని కళాశాల యాజమాన్యం వెల్లడించింది.