కొండపోలం నుంచి బిగ్ అప్డేట్.. దుమ్ము లేపుతున్న “దమ్.. దమ్.. దమ్” సాంగ్

-

మెగా అల్లుడు, టాలీవుడ్ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మరియు టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ లు జంటగా నటిస్తోన్న చిత్రం కొండపొలం. ప్రముఖ నవల కొండపొలం ఆధారంగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కొండపొలం సినిమా ఎల్లుండి గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు మరియు ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇది ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న కొండపొలం సినిమా నుంచి తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. దమ్.. దమ్… దమ్… అంటూ సాగే పాట మేకింగ్ వీడియో కొండపొలం మూవీ నుంచి విడుదలైంది.

ఇక ఈ సాంగ్ పూర్తిగా జానపద నేపధ్యంలో సాగినట్లు మనకు కనిపిస్తుంది. ఈ పాటలో హీరో వైష్ణవ్ తేజ్ మరియు హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అద్భుతంగా నటించారు. హీరో హీరోయిన్లు.. గొర్లను కాయటం అలాగే పచ్చడి పొలాల అందాలను ఆస్వాదించడం లాంటివి ఈ పాటలో మనకు కనిపిస్తాయి. విడుదలైన కాసేపటికే ఈ పాట కు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాగా కొండపొలం సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీత స్వరాలు అందించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version