ధనుష్ “సార్” ఫస్ట్ లుక్ రిలీజ్

-

కోలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించబోతున్నారు. ధనుష్ ఎన్నాళ్ల నుంచో స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు. రఘువరణ్ బీటెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన ధనుష్ ఆతరువాత మారి, వీఐపీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను అలరించారు. తాజాగా ’సార్ ‘ అనే చిత్రం ద్వారా తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. దీన్ని తమిళంలో ’వాతి‘గా నిర్మిస్తున్నారు.గతంలో రంగ్ దే, తొలిప్రేమ చిత్రాలకు దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి దర్శకత్వంతో ధనుష్ సార్ సినిమా రాబోతోంది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఇందులో ధనుష్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఓ లైబ్రరీలో కూర్చొని… చాలా శ్రద్ధగా పనిచేసుకుంటున్నాడు ధనుష్. ఈ లుక్ చూస్తుంటే.. టైటిల్కు తగ్గట్టుగానే ఈ సినిమాలో ఓ లెక్చరర్ గా ధనుష్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version