చంద్రబాబుపై తిరుమల శ్రీవారే యాక్షన్‌ తీసుకుంటారు – ధర్మాన కృష్ణ దాస్

-

చంద్రబాబుపై తిరుమల శ్రీవారే యాక్షన్‌ తీసుకుంటారని హెచ్చరించారు వైసీపీ సీనియర్‌ నాయకుడు ధర్మాన కృష్ణ దాస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు పి.యన్.కాలనీలోనీ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయoలో మాజీ డిప్యూటీ సిఎం ధర్మాన కృష్ణదాస్ పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సి.ఎం, జిల్లా వైసిపి అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ… పవిత్రమైన ప్రసాదంపై కూడా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చేసే వ్యాఖ్యలు చాలా దురదృష్టకరమన్నారు.

Dharmana Krishna Das slams chandrababu

మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే దానిని కూడా అడ్డుకోవాలని చూడటం ఘోరమైన పరిస్థితి ఉందని తెలిపారు. ఇది రాక్షస ప్రభుత్వమని చెప్పడానికి అంతకన్నా వేరే నిదర్శనం లేదని వెల్లడించారు. దివంగత నేత YSR గాని,జగన్ మోహన్ రెడ్డి గాని గతంలో స్వామి వారిని దర్శించుకున్నారని…ఆనాడు అనుమతిచ్చిన వారు ఈనాడు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశానికి నిరాకరించడం దురదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. భగవంతుడు ఉన్నాడు కచ్చితంగా తప్పుకి పనిష్మెంట్ ఉంటుంది… ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచి రాష్ట్రంలో దౌర్జన్యకరమైన సంఘటనలు జరుగుతున్నాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version