ఎక్కువ మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్ వలన ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే డయాబెటిస్ సమస్యని లైట్ తీసుకోకుండా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవాళ్లు కచ్చితంగా ఈ మూడు ఆహార పదార్థాలుని డైట్ లో చేర్చుకోవాలని చెప్తున్నారు.
మరి వేటిని డైట్ లో చేర్చుకోవాలని అనేది ఇప్పుడు చూద్దాం. డయాబెటిస్ సమస్య కలిగిన వాళ్ళు ఈ మూడు ఆహార పదార్థాలను కచ్చితంగా డైట్ లో చేర్చుకోవడం మంచిది. డయాబెటిస్ ఉన్నవాళ్లు కచ్చితంగా తీసుకునే ఆహారంపై దృష్టి పెట్టాలి ఎటువంటి ఆహార పదార్థాల వలన గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయి ఎటువంటి వాటి వల్ల తగ్గుతాయి అనేది ఖచ్చితంగా గమనించాలి.
డయాబెటిస్ వున్నవాళ్లు వీటిని తీసుకోండి:
టమాటా:
టమాటా ని ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఇందులో విటమిన్ సి ఉంటుంది అలానే విటమిన్ ఏ కూడా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్న వారికి కంటిచూపు సమస్యలు వస్తాయి కనుక అటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే టమాటా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే లైకోపీన్ హార్ట్ కి చాలా మంచిది.
క్యాన్సర్ తో కూడా టమాటా పోరాడగలదు కాబట్టి షుగర్ సమస్యతో బాధపడే వాళ్ళు టమాటాలు తీసుకోవడం మంచిది.
పాలకూర:
పాలకూర వల్లనే కూడా చక్కటి ప్రయోజనాలను డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు పొందొచ్చు.
దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
వెంటనే డైజేషన్ అవ్వదు కనుక ఆహారంలోనే షుగర్ మొత్తం వెంటనే రక్తంలో కలవదు. నెమ్మది నెమ్మదిగా వెళుతుంది కనుక ఒకేసారి గ్లూకోస్ లెవెల్స్ పెరగవు.
డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు పాలకూరని తీసుకుంటే ఈ లాభాలను పొందొచ్చు.
బ్రోకలీ:
బ్రోకలీ కూడా చాలా మంచిది ఇందులో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా వెంటనే జీర్ణం అయిపోదు.
దీనితో ఒకేసారి షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి.
కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు బ్రోకలీని కూడా తీసుకోవడం మంచిది. ఇలా ఈ ఆహార పదార్దాలతో చక్కటి లాభాలను పొందేందుకు అవుతుంది.