పరుపుల వల్ల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌ వస్తుందని మీకు తెలుసా..? ఎన్నేళ్లనుంచి వాడుతున్నారు..?

-

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో తెగ ఇబ్బంది పడుతున్నారు. వీటికి కారణాలు ఏవేవో ఉంటాయి.. అందులో మీరు పడుకునే బెడ్‌ కూడా ఒకటని మీకు తెలుసా..? నిద్రసుఖమెరగదు అంటారు కానీ..ప్రశాంతమైన నిద్రకావాలంటే.. సుఖమైన పడక ఉండాల్సిందే..! బెడ్‌ను చూస్తేనే నిద్రవచ్చేయాలి అలా సెట్‌ చేసుకుంటే.. మీకు త్వరగా నిద్రపడుతుంది. మీరు వాడే బెడ్‌ను ఎప్పుడు మార్చాలో తెలుసా..? ఎందుకు తెలియదు.. అది పాడైనప్పుడు అంటారా..? ఆలస్యంగా నిద్రపోవడం, వెన్నునొప్పి లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే దీనికి కారణం మీరు పడుకునే మంచం కూడా కావొచ్చు. మీరు నిద్రపోయే మంచం కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

మీ మంచం కొని ఎన్ని రోజులు అవుతుంది? మీ పరువు ఎంత పాతదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు పరుపును కొని పదేళ్లు దాటితే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉందట… ఏడేళ్లకు మంచి ఒకే పరుపును ఉపయోగించడం మంచిది కాదు. సంవత్సరాలు గడిచేకొద్దీ, మీరు ఉపయోగించే పరుపు నాణ్యత క్షీణిస్తుంది. మీ శరీర భాగాలు చేతులు, కాళ్ళు నొప్పికి గురవుతాయి. ఇది నిద్రలేమికి కారణమవుతుంది. మీ పరుపుపై మరకలు లేదా అసహ్యకరమైన వాసన కలిగి ఉందా? ఒకటి మీరు మీ మంచాన్ని శుభ్రం చేయాలి. చాలా పాతది అయితే దాన్ని మార్చండి. ఎందుకంటే పరుపై చాలా బ్యాక్టీరియా, దుమ్ము, శరీర ద్రవాలను గ్రహిస్తుంది. ఇది మీ శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడానికి దారితీస్తుంది..

తడిజుట్టుతో నిద్రపోతున్నారా..?

తడి జుట్టుతో నిద్రించడం చాలా అపరిశుభ్రమైనది. ఎందుకంటే దిండు, మంచం మీ తడి జుట్టు నుంచి నీటిని పీల్చుకుంటాయి. ఇది బ్యాక్టీరియా పెరుగుదలకు ప్రధాన కారణం అవుతుంది.. చెమట, మృత చర్మ కణాలు, నూనెలు మీ పరుపులో ఉంటాయి. దీంతో వాసనతోపాటు బ్యాక్టీరియా కూడా పేరుకుపోతుంది.

మృదువైన పరుపు మీకు మంచి నిద్రను ఇస్తుంది. నాణ్యమైన కుషనింగ్‌తో కూడిన మృదువైన పరుపును ఎంచుకోవడం మీకు చాలా ముఖ్యం.. లేదంటే సరిగ్గా నిద్రపోకపోవడం, వెన్నునొప్పి వంటి వ్యాధులకు దారి తీస్తుంది.

పరుపుల కారణంగా..లంగ్‌ ఇన్ఫెక్షన్‌

పరుపుల తయారీలో ఫార్మల్డ్ హైడ్, బెంజీన్, నాఫ్తలీన్ లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి కారణంగా కళ్లు, ఊపిరితిత్తులు, చర్మానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.. ఛాన్స్ ఉంది. అలర్జీలు, దురదలు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. నాఫ్తలీన్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంది. నాఫ్తలీన్ అనే రసాయనం కారణంగా పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా వచ్చే ఛాన్స్‌ ఉందని నిపుణులు అంటున్నారు..
బెంజీన్ కారణంగా కడుపులో అల్సర్ వచ్చే అవకాశం ఉంది. దీనివలన ఆరోగ్యంగా ఉండే కణాలు క్యాన్సర్ కణాలు మారే ఛాన్స్ ఉంది.

ఆ పరుపుల వల్ల డిస్క్‌ సమస్య..

స్పాంజి పరుపుల ద్వారా వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా మన మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. పరుపుల్లో ఉండే కుషనింగ్ కారణంగా వాటి మీద పడుకుంటే.. మన శరీర ఆకృతి మారుతుంది. దీని వల్ల డిస్క్‌లపై ఒత్తిడి పడుతుంది. డిస్క్‌లు పక్కకు జరగడం ఉంటుంది. డిస్క్‌లు పక్కకు జరిగితే.. నరాలు, వెన్నుపాముపై ఒత్తిడి పడుతుంది. దూదితో తయారు చేసే పరుపులకు ప్రాధాన్యత ఇవ్వండి.

అన్నింటికంటే ఇది బెటర్‌..

నేలపై పడుకుంటే చాలా మంచిది. మెుదట కాస్త ఇబ్బంది ఉన్నా.. అలవాటు అయితే.. మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. నేలపై నిద్రిస్తే.. ఒత్తిడి తగ్గుతుంది. మెంటల్ హెల్త్ కండీషన్ బాగుంటుంది. వెన్నునొప్పితో బాధపడే వాళ్లు.. నేలపై పడుకుంటే ఆరోగ్యం. శరీరాకృతి కూడా మెరుగవుతుంది. కానీ నేలపై పడుకోవడం ఈరోజుల్లో కాస్త కష్టమైన పనే.. కానీ ట్రై చేస్తే అంత సాధ్యం కానీ పని అయితే కాదు.. లేకపోతే.. దూదితో తయారు చేసే పరుపులకు ప్రాధాన్యత ఇవ్వండి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version