పురుషుల కంటే కూడా ఎక్కువగా మహిళలు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. అందుకని మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మహిళలు ఎక్కువ పని చేయడం, తక్కువ ఓపిక ఉండటం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే మంచి ఆహారం తీసుకోవడం, మంచి జీవన విధానాన్ని అనుసరించడం చాలా ముఖ్యం. అయితే ప్రతి సంవత్సరం కూడా మహిళలు ఈ ఆరు సమస్యలతో సతమతమవుతున్నారు. మరి ఆ ఆరు సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పీరియడ్స్ సమస్యలు:
చాలా మంది మహిళలు ఇర్ రెగ్యులర్ పీరియడ్స్ లేదా పీరియడ్స్ లో వివిధ రకాల సమస్యలు రావడం లాంటివి జరుగుతున్నాయి. అలానే PMS సమస్యతో కూడా చాలా మంది మహిళలు సతమతమవుతూ ఉంటారు.
ఫెర్టిలిటీ సమస్యలు:
చాలామంది మహిళలు ఈ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. ఫెర్టిలిటీ సమస్యలు జీవన విధానం, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం మరియు ఫిజికల్ స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ కారణంగా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మంచి జీవన విధానాన్ని అనుసరించి మంచి ఆహారం తీసుకుని ఒత్తిడికి దూరంగా ఉండి చెడు అలవాట్లు లేకుండా ఉంటే ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
థైరాయిడ్ సమస్యలు:
పురుషుల కంటే కూడా రెండు రెట్లు ఎక్కువ మంది మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా మహిళలకు హైపోథైరాయిడిజం సమస్య ఉంటుంది. దీనితో మెటబాలిజం తగ్గిపోతుంది.
బ్రెస్ట్ క్యాన్సర్:
బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యలు కూడా మహిళలలో ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి ఏటా చాలా మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యతో బాధపడుతున్నారు.
సెక్సువల్ హెల్త్ మరియు బ్లాడర్ సమస్యలు:
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, STD’s సమస్యతో కూడా చాలా మంది మహిళలు సతమతమవుతున్నారు. ఈ సమస్య వస్తే గుర్తించడం కూడా కష్టమే. ఏది ఏమైనా ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
డిప్రెషన్:
ప్రతి ఏటా మిలియన్ల మంది మహిళలు డిప్రెషన్ సమస్యతో కూడా బాధ పడుతున్నారు. డిప్రెషన్ ఎక్కువగా ఉండడం వల్ల ఆత్మహత్యకు కూడా పాల్పడుతుంటారు. అయితే ఇటువంటి సమస్యలు ఏమి రాకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ జీవన విధానాన్ని పాటిస్తూ వ్యాయామం చేయడానికి సమయాన్ని కేటాయిస్తూ ఆరోగ్యకరమైన పద్ధతులని పాటిస్తే సరిపోతుంది దీంతో ఈ సమస్యల బారిన పడకుండా ఉండొచ్చు.