నిద్రించ‌డానికి నియమాలు ఉన్నాయి తెలుసా!

-

భారతీయం సనాతనం. అనాదిగా మన దేశంలో ప్రతి పనికి కొన్ని నియమనిబంధనలను ఏర్పర్చారు. వాటిలో శాస్త్రీయత దాగి ఉంది. కొన్ని నిరూపించబడ్డాయి. మరికొన్ని అలానే ఉన్నాయి.. ఇలాంటి వాటిలో నిద్రనియమాలు. అవేంటో తెలుసుకుందాం&. పడుకోవాలంటే 15 సూత్రాలు పాటించాలని పండితుల పేర్కొంటున్నారు. శాస్ర్తాలల్లో చెప్పినవి….

– నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో, ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం, స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.(మనుస్మృతి)

– పడుకోని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు (విష్ణుస్మృతి)

– విద్యార్థి, నౌకరు, ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలప వచ్చును.(చాణక్య నీతి)

– ఆరోగ్యవంతులు ఆయు రక్ష కోసం బ్రహ్మా ముహూర్తంలో నిద్ర లేవాలి (దేవీ భాగవతము). పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు (పద్మ పురాణం)

– తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది. (అత్రి స్మృతి) విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. (మహాభారతం)

– నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు. (గౌతమ ధర్మ సూత్రం)

– తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తలపెట్టి నిద్రించిన ప్రబల చింత, ఉత్తరం వైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు, ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము,ఆయువు ప్రాప్తిస్తుంది. (ఆచార మయూఖ్)

– పగటిపూట ఎపుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసంలో 1 ముహూర్తం (48నిమిషాలు) నిద్రిస్తారు. (పగటిపూట నిద్ర రోగ హేతువు, ఆయు క్షీణత కలుగ చేస్తుంది)

– పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి , దరిద్రులు అవుతారు. (బ్రహ్మా వైవర్తపురాణం)

– సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే పడుకోవాలి

– ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.

– దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడు నిద్రించకూడదు.యముడు, దుష్ట గ్రహముల నివాసం వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.

– గుండెపై చేయి వేసుకుని, చెత్తు బీము కింద, కాలుపై కాలు వేసుకుని నిద్రించరాదు.

– పడక మీద త్రాగడం, తినడం చేయకూడదు.

– పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసక బారుతుంది.

ఈ నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, మరియు దీర్ఘాయుష్మంతుడు అవుతారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news