దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎన్టీఆర్‌పై, టీడీపీపై ప్రశంసల వర్షం కురిపించారు. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆయనకు ఎన్టీఆర్ శతాబ్ది చలన చిత్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. నాజరుపేటలోని ఎన్‌వీఆర్ కన్వెషన్‌లో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. తన సినీ జన్మకు ఎన్టీఆర్ కారణమని ఈ స్థాయికి చేరేందుకు అన్నగారి ఆశీర్వాదం ఉందన్నారు. ఈ పురస్కారాన్ని పైలోకంలో ఉన్న ఎన్టీఆర్ పంపినంత ఆనందంగా ఉందని రాఘవేంద్రరావు వ్యాఖ్యానించారు.
ఏడాది పాటు తెనాలిలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు చేయడం అభినందనీయమని, 1963లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా భీముని పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌కు క్లాప్ కొట్టానని, ఆయనతో తీసిన 12 సినిమాలు బ్లాక్‌బస్టర్ అయ్యాయని రాఘవేంద్రరావు వివరించారు.అంతేకాకుండా బాపట్ల జిల్లాలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు రోజుకూ టీడీపీకి ప్రజల్లో ఆదరన పెరుగోతందని, వచ్చే రెండేళ్లలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.