డైరెక్టర్ సింగీతం ఇంట తీవ్ర విషాదం

-

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సతీమణి లక్ష్మీకళ్యాణి అనారోగ్య కారణంగా శనివారం రాత్రి కన్నుమూశారు. ఈ విషయాన్ని సంగీతం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా భార్య లక్ష్మీకళ్యాణి శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. 62 ఏళ్ల సుదీర్ఘ ప్రమాణానికి బ్రేకులు పడ్డాయి. మా భాగస్వామ్య జీవితానికి ముగింపు పడింది.’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

సింగీతం శ్రీనివాసరావు-లక్ష్మీకల్యాణి

కాగా, సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకళ్యాణిని 1960లో వివాహం జరిగింది. సింగీతం సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. సినీ కెరీర్‌లో లక్ష్మీకళ్యాణి పాత్ర ఏంతో కీలకం.. సినిమా స్క్రిప్ట్ రాయడంలో ఆయనకు ఎంతో సహకరించింది. అయితే లక్ష్మీకళ్యాణి గురించి సింగీతం ‘శ్రీకళ్యాణీయం’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ప్రభాస్ నటించబోతున్న తాజా చిత్రం ప్రాజెక్ట్ కేలో కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నట్లు ఒప్పుకున్నారు. కానీ ఆయన అనారోగ్య పరిస్థితి వల్ల సినిమా నుంచి తప్పుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version