Breaking: విడాకులు తీసుకోనున్న డైరెక్టర్ శ్రీనువైట్ల దంపతులు

-

సినీ ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణం. అభిప్రాయ భేదాలు రావడంతో దంపతులు విడాకులు తీసుకుని సపరేట్ అవుతుంటారు. పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా ఉన్న దంపతులు సైతం విడాకులు తీసుకుని తమ అభిమానులకు ఒక్కసారిగా షాక్ ఇస్తుంటారు. ఇప్పటికే నాగ చైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య, అమీర్ ఖాన్-కిరణ్ వంటి ప్రముఖులు విడాకులు తీసుకున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ కూడా విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం.

శ్రీనువైట్ల-రూప
శ్రీనువైట్ల-రూప

ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల, ఆయన భార్య రూప విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలో సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఢీ’ సినిమాను రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మంచు విష్ణు కోరిక మేరకు స్క్రిప్ట్ కూడా తయారు చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసి మధ్యలో ఆపివేసినట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి దర్శకుడు శ్రీనువైట్ల మీడియా ముందు కనిపించలేదు. తాజాగా విడాకుల వార్తతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీనువైట్ల సినిమాల్లో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన రూపను పెళ్లి చేసుకున్నారు. గతంలోనూ విడాకులు తీసుకునేందుకు కూడా ప్రయత్నించినట్లు సమాచారం. కానీ ఇంట్లో వాళ్లు కలగజేసుకోవడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులకు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. విడాకాలు తీసుకుంటున్నట్లు తెలుపడంతో ఆ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news