ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యలలో కిడ్నీలో రాళ్లు కూడా ఒకటి. కిడ్నీలో రాళ్లు చేరడం వలన చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎక్కువ సాల్ట్ మరియు మినరల్స్ క్రిస్టలైజ్ అయ్యి కిడ్నీలో చేరుతాయి. అయితే ఇవి యూరినరీ ట్రాక్ట్ లో జరుగుతూ ఉంటాయి. స్టోన్స్ అనేవి ఏర్పడడం వల్ల నొప్పి సడన్ గా వస్తూ ఉంటుంది. అటువంటప్పుడు వెంటనే చికిత్స చేయించుకోవాలి.
కిడ్నీ స్టోన్స్ ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనబడతాయి:
వికారం
వాంతులు
మూత్రం పింక్ కలర్ లో కాని ఎరుపు రంగులో కాని రావడం
ఎక్కువ సార్లు యూరిన్ రావడం
వెన్నులో నొప్పి రావడం
బార్లీ నీళ్లని ఈ విధంగా తయారు చేసుకోండి:
పావు కప్పు బార్లీలో మూడు కప్పులు మరిగించిన నీళ్లు వేయండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. నిమ్మరసాన్ని కానీ కమల రసాన్ని కానీ ఈ నీళ్లలో వేసుకుని తీసుకోవచ్చు. ఇలా ఈ నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయటపడవచ్చు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడే వీటిని కూడా తీసుకోవచ్చు:
నిమ్మరసం: కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే నిమ్మరసాన్ని కూడా తీసుకుంటూ ఉండొచ్చు.
ఆపిల్ సైడర్ వెనిగర్: గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి కూడా తీసుకోవచ్చు.
sreemukhi దానిమ్మ రసం తాగితే కూడా కిడ్నీ రాళ్ల సమస్య నుండి బయట పడవచ్చు.
తులసి ఆకుల రసం: ఈ రసాన్ని కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయట పడడానికి అవుతుంది.