దీపావళి సమయంలో క్రాకర్స్ వల్ల కాలుష్యం ఏర్పడుతుందని పలు రాష్ట్రాలు క్రాకర్స్ ను నిషేధించాయి. వీటిపై కోర్టులు కూడా ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీ చేశాయి. కేవలం అనుమతించిన సమయంలోనే క్రాకర్స్ ను కాల్చాలంటూ పలు రాష్ట్రాలు నిబంధనలు విధిస్తున్నాయి. కాగా ఈ నిషేధాలపై సద్గురు జగ్గీవాసు దేవ్ విమర్శలు గుప్పించారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. క్రాకర్స్ కాల్చాలనే పిల్లల ఆశలను అడ్డుకోవద్దని అన్నారు. వీరి సంతోషాన్ని దూరం చేయద్దని అన్నారు. కాలుష్యం పేరులో క్రాకర్స్ ను నిషేధించిడం మంచి పద్దతి కాదన్నారు. పిల్లలకు దీపావళి పండగ అంటే ఏమిటో తెలియజేయాలని సూచించారు. తమ చిన్నప్పుడు దీపావళి కన్నా నెల ముందు నుంచి దీపావళి తరువాత రెండు నెలల వరకు క్రాకర్స్ ను భద్రపరుచుకుని కాల్చేవారమని వెల్లడించారు. మీకు పర్యావరణంపై అంతగా ప్రేమ ఉంటే మూడు రోజుల పాటు ఆఫీసులకు కార్లతో కాకుండా నడిచి వెళ్లాలని సూచించారు. పెద్దలు పిల్లల సంతోషం కోసం త్యాగం చేయాలని సూచించారు. పెద్దలు క్రాకర్స్ కాల్చవద్దని అన్నారు.