కార్తీకదీపం ఎపిసోడ్ 1187: ఇంట్లో రచ్చరచ్చ చేసిన దీప..వంటలక్క కళ్లలోకి చూసేందుకు కూడా భయపడుతున్న కార్తీక్, సౌందర్యలు

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో కారులో ఉన్న దీప పంతులుగారు రాసిచ్చిన ఆ లిస్ట్ చూసి ఈ పూజలేంటి, నాకు తెలియకుండా అత్తయ్యడాక్టర్ బాబు ఏం చేస్తున్నారు అనుకని పేపర్ ని మళ్లీ అక్కడే పెట్టేసి పాపం ఏడుస్తుంది. ఈ విషయాలు అన్నీ నా దగ్గర దాచిపెట్టడమేంటి, ఈ పూజకు మోనితకు ఏమైనా సంబంధం ఉందా అనుకుంటుంది. సౌందర్య పూజగురించి కార్తీక్ తో ఫోన్ లో మొత్తం చెబుతుంది. సౌందర్య కారు ఎక్కుతుంది. టెన్షన్ గా ఏం లేదు దీప కార్తీక్ ఏమంటున్నాడంటే అని చెప్పబోతుంది. నేను ఏం అడగలేదు కదా అంటుంది దీప. నువ్వు కనిపించకపోయే సరికి కార్తీక్ టెన్షన్ పడ్డాడో తెలుసా అంటుంది. అప్పుడప్పుడు నేను కనిపించినా కూడా టెన్షన్ పడుతున్నారు కొందరు అంటుంది దీప.

karthika-deepamఇంట్లో కార్తీక్ మోనిత అన్న మాటలను తలుచుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆనంద్ రావు వస్తాడు. దీప ఎక్కడికి వెళ్లిందో ఏమైనా తెలిసిందా అంటాడు. మమ్మీ ఇప్పుడే కాల్ చేసింది..తను దారిలో కలిసిందంట, ఇద్దరు వస్తున్నారు..వచ్చేస్తుందిలే డాడీ, మీరు టెన్షన్ పడకండి అంటాడు కార్తక్. వచ్చేస్తే సరిపోతుందా, దీపకు నిజం చెప్పవా అంటాడు ఆనంద్ రావు. కార్తీక్ అలా ఎలా చెప్పగలను డాడీ అంటాడు. నిజాన్ని నిర్భయంగా ఒక్క ముక్కలో చెప్పొచ్చు అంటాడు ఆనంద్. కానీ కార్తీక్ మాత్రం నాకు సిగ్గుగా ఉంది, నేను చెప్పలేను అంటాడు. కానీ ఆనంద్ రావు మాత్రం చెప్పమనే అంటాడు. వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మోనిత ఫోన్ చేస్తుంది. కార్తీక్ కట్ చేసినా పదే పదే చేస్తుంది. ఆనంద్ రావు నిజం చెప్పేస్తే నీకు ఈ టెన్షన్ ఉండు, అే నిజం దీపకు వేరేవాళ్లద్వారా తెలిస్తే అప్పుడు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయ్ అంటాడు. ఇంతలో దీప, సౌందర్య వస్తారు. ఇంట్లోకి రాగానే పిల్లలు వచ్చి ఎక్కడికి వెళ్లావ్ అమ్మా, సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లలేదేమ్మా అంటుంది. నా దగ్గరే బోల్డెన్ని ప్రశ్నలు ఉన్నాయి..మీరు ఇంకా ప్రశ్నలు అడగకండి..మొఖాలేంటి అలా ఉన్నాయ్..ఇంకా తినలేదా అంటుంది. నువ్వు వచ్చాక తిందాం అని వెయిట్ చేస్తున్నాం అంటారు పిల్లలు. దీప ఎందుకో తిక్కలేస్తుంది..పక్కనే ఉన్న శ్రావ్యమీద..కోపపడుతుంది. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, నా పిల్లలు తిన్నారో లేదా చూడరా అంటుంది. అక్కా నేను వాళ్లను అడిగాను అంటుంది శ్రావ్య. అడగడమేంటి, మీరు తిన్నారుగా, పసివాళ్లు తినలేదా ఒక్కరికైనా అనిపించలేదా అంటుంది. ఇంతలో కార్తీక్ వచ్చి దీప ఎక్కడికివెళ్లావ్ అంటే..దీప ఓ లుక్ ఇస్తుంది. శ్రావ్యమీద అరుస్తునే ఉంటుంది. నేను ఇంట్లో లేకపోతే నా పిల్లలకు తిండిపెట్టరా, అనాథల్లాగా వదిలేశారా..మాట్లాడవేంటి శ్రావ్య…అయినా ఈ ఇంట్లో అందరికి పిల్లలను వదిలేయటం అలవాటేకదా.. నువ్వు దీపుగాడిని వదిలేసినట్లు నేను నా పిల్లను వదిలేయలేను కదా..ఇప్పుడే ఇలా ఉంటే..రేపు నేను చస్తే ఎలాగా అంటుంది. సౌందర్య ఏంటే ఆ మాటలు అంటుంది. అంతేకదా అత్తయ్య నేను లేకపోతే..నా పిల్లలకు ఒక ముద్ద పెట్టే దిక్కుకూడా లేదు.. అంటూ పిల్లలను తీసుకెళ్లి బలవంతంగా టిఫెన్ పెడుతుంది. ఇంట్లో వాళ్లకు ఏం అర్థంకాదు.

సౌందర్య, కార్తీక్ ఏంటి దీప ఇలా ఉంది అని మాట్లాడుకుంటారు. దీపకు ఏమైనా నిజం తెలిసిందా అని సౌందర్య అంటే..తెలిసే ఛాన్స్ హే లేదు అంటాడు. ఇదంతా వింటున్న ప్రియమణి ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటుంది…దీపమ్మ ఇలానే ఉంటే..మోనితమ్మ వస్తుంది అనుకుంటుంది. కార్తీక్ బయటకు వచ్చి దీపకు ఏమైంది..మోనిత డెలివరీ అయినట్లు తెలిసిందా, దీపకు నిజం తెలిస్తే ఇలా ఉండదుకదా, నా కాలర్ పట్టుకుని నిలదీస్తుంది కదా అసలు దీప మనసులో ఏముంది, తన కళ్లలో చూసి ఎక్కడికి వెళ్లావ్ అని అడిగే ధైర్యం చేయలేకపోతున్నాను అనుకుంటూ ఆలోచిస్తాడు.

దీప ఆ ల్యాబ్ లో చెప్పిన విషయాలనే ఆలోచిస్తూ..తన చెప్పింది నిజమేనా..నిజమే అయితే అబద్ధం చెప్పింది మోనితా, డాక్టర్ బాబా.. నన్ను చూస్తే మాట మారుస్తున్నారు, ఆ దోషనివారణ పూజ ఏంటి, ఏం జరుగుతుంది, అత్తయ్యగారు, డాక్టర్ బాబు నన్ను మోసం చేస్తున్నారు, అత్తయ్య చూపించే ప్రేమంతా నాటకమా, నాకు చదువురాదని నన్ను ఒక దద్దమ్మలా చూస్తున్నారు, ఈ ఇంటికి నేను కోడలుగా అర్హతలేదా, నన్ను ఒక పూచికపుల్లలా తీసిపారేస్తున్నారు, ఆ మోనిత దగ్గరకు ఎందుకు వెళ్తున్నారు, అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరమేంటి అనుకుంటూ దీప మనసులో వందప్రశ్నలు ఉంటాయి. ఇంతలో పిల్లలు వచ్చి ఇక్కడ ఉన్నావేంటి అంటారు. ఎవరకు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది అంటుంది దీప. పిల్లలు నువ్వు బయటకు వెళ్తే అన్నంపెట్టించుకుని తింటాం, నిన్ను విసిగించం అంటారు. శౌర్య మా మీద అలిగావా అంటే..నేను అలిగితే ఈ ఇంట్లో ఎవరికి పడుతుందిలే అంటుంది. దీప మనసులో ఇప్పుడు నేను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు..వీళ్లంతా ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకుని అప్పుడు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాను..అదే నా జీవితంలో చివరి నిర్ణయం అవ్వాలి, భగవంతుడా సరైన నిర్ణయం తీసుకునే శక్తిని నాకు ఇవ్వు అని కోరుకుంటుంది. అలా ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news