రిలీజ్ టుడే : ఆల్ ద బెస్ట్ డీజే టిల్లు

-

ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా డీజే టిల్లు విడుద‌ల‌వుతోంది.సిద్ధూ జొన్న‌ల‌గ‌డ్డ, నేహాశ‌ర్మ జంట‌గా న‌టించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. డిజే టిల్లు పాటతో అంద‌రి చూపూ త‌న‌వైపు తిప్పుకున్నారు చిత్ర యూనిట్‌. ఈ పాట‌ యూట్యూబ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ కూడా వావ్ అనేలా యూత్‌కి బాగా క‌నెక్ట్ అయ్యింది. సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. వాటిని అందుకునే విధంగా సినిమా ఉంటుందా లేదా అన్న‌ది మ‌రికొద్ది సేప‌ట్లో తేలిపోనుంది.

సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై వంశీ నిర్మించారు ఈ చిత్రాన్ని..! త్రివిక్ర‌మ్ శ్రీ‌ను స్క్రిప్ట్ గైడ్ గా వ్య‌వ‌హరించారు.ఇప్ప‌టికే సినిమా యూఎస్ లో విడుద‌ల‌యింది. అక్క‌డి నుంచి మంచి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. అక్క‌డ షోలు హౌస్ ఫుల్ అయ్యాయ‌న్న టాక్ ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. డార్క్ హ్యూమర్ జానర్లో విడుద‌ల‌వుతున్న ఈ సినిమా ఇక తెలుగురాష్ట్రాల‌లో ఎలాంటి టాక్ తెచ్చుకోనుందో మ‌రి!

Read more RELATED
Recommended to you

Latest news