హుజురాబాద్ పై స్పందించ‌ని ఆ ఇద్దరు.. ఫైర్ బ్రాండ్ల మౌనం వెన‌క కార‌ణ‌మేంది..?

-

హుజురాబాద్ బై పోల్‌ను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి స్వయంగా సీఎం కేసీఆర్ వెల్లడించారు. అసైన్డ్ ల్యాండ్స్ కబ్జా ఆరోపణలతో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ తర్వాత బీజేపీలో చేరి ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. మోకాలికి సర్జరీ అనంతరం ఈటల మళ్లీ ప్రచారం షురూ చేశారు.
అయితే, బీజేపీలో ఉన్న ఆ ఇద్దరు మహిళా నేతలు ఈటల తరఫున ప్రచారంలో కనిపించడం లేదు. వారు ఎవరో తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సినీనటి, బీజేపీ నేత విజయశాంతి హుజురాబాద్ ప్రచారంలో కనిపించడం లేదు. అయితే, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఇతర నేతలు ఈటల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సినీనటి విజయశాంతి కూడా అప్పట్లో ఈటలతో భేటీ అయింది.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

ఇక ప్రచారంలో కనిపించబోతున్నదనే వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఏమైందో ఏమో తెలియదు. విజయశాంతి ప్రచారంలో అస్సలు కనిపించలేదు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఆ పార్టీ తరఫున హుజురాబాద్‌లో ప్రచారంలో కనిపించలేదు. అయితే, వ్యూహాత్మకంగానే వారిని పక్కన పెట్టినట్లు కమలం పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ జిల్లాకు చెందిన మహిళా నేత అభ్యర్థిగా ఉండబోతున్నట్లు తెలుస్తుండగా, అదే నిజమైతే బీజేపీ తరఫున మహిళా నేతలు కౌంటర్ అటాక్ చేసేందుకు రెడీ అయిపోయే చాన్సెస్ ఉంటాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ కానీ, అధికార టీఆర్ఎస్ పార్టీ కానీ హుజురాబాద్ అభ్యర్థి ఎవరు? అనేది ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఇకపోతే టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ ఉండబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి.. ఎవరికి ఆయా పార్టీలు టికెట్ ఇస్తాయో..

Read more RELATED
Recommended to you

Latest news