రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ నేతల నుంచి కౌంటర్లు ప్రారంభమయ్యాయి. పంచాయతీ తెగే దాకా ఇదే విధంగా సమావేశాలు ఉంటాయన్న కేసీఆర్ కామెంట్లకు కౌంటర్ గా … నిన్ను రోజూ బయటకి రప్పించడమే మా పని అని డీకే అరుణ అన్నారు. నిన్ను వదిలిపెట్టేది లేదన్నారు. హుజూరాబాద్ ఓటమితో కేసీఆర్ కు సెగ తగిలిందన్నారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు కళ్లు తెరిపించారన్నారు. ఫలితాన్ని చూసి కేసీఆర్ కు దిమ్మ తిరిగిందని డీకే అరుణ అన్నారు. తెలంగాణకు ద్రోహివి నువ్వని డీకే అరుణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల త్యాగాలను తక్కువ చేస్తున్న కేసీఆర్ ద్రోహే అని అన్నారు. గల్వాన్ ఘర్షణలో మరణించిన సంతోష్ బాబు వీరత్వాన్ని మరిచిపోయావా..అ ని ప్రశ్నించారు. గతంలో కరీంనగర్ ఉప ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి నిన్ను గెలిపించారన్నారు. బీజేపీ బలపడుతుంటే నీ కుర్చి కిందికి నీళ్లు వస్తున్నాయని.. విమర్శించారు. రాష్ట్రంలో రోహింగ్యాలను పెంచి పోషిస్తున్నది నువ్వే అని. . వారిని ఓటు బ్యాంకు గా ఉపయోగించుకుంటున్నామని కేసీఆర్ ను విమర్శించారు. దేశంలో నీలా అబద్దమాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా..అని ఎద్దేవా చేశారు.
నిన్ను రోజూ బయటకి రప్పించడమే మా పని… కేసీఆర్ కు డీ.కే. అరుణ కౌంటర్
-