ఈ ట్యాబ్లెట్లకు డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ అవసరం లేదా?

-

డాక్టర్ ప్రిస్ర్కిప్షన్ లేకుండా 16 రకాల మందులను మెడికల్ షాపుల నుంచి విక్రయించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా అధికార ప్రకటన జారీ చేసింది. అయితే లైసెన్స్ ఉన్న దుకాణదారులే వీటిని విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే రోగి సమాచారాన్ని తీసుకుని మెడిసిన్స్ ఇవ్వాలని తెలిపింది. ఆ మెడిసిన్స్ కూడా ఐదు రోజులకే వాడాలని, అప్పటికే ఆ రోగికి వ్యాధి నయం కాకపోతే డాక్టర్‌ను సంప్రదించాలని వెల్లడించింది.

medicines
medicines

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిస్ర్కిప్షన్ అవసరం లేని మందుల జాబితాను విడుదల చేసింది. పొవిడోన్ అయోడిన్ (యాంటీ సెప్టిక్), క్లోరోహెక్సిడైన్ గ్లుకోనేట్ (మౌత్ వాష్), క్లోట్రిమాజోల్ క్రీం (యాంటీ ఫంగల్), క్లోట్రిమాజోల్ డస్టింగ్ పౌడర్, డెక్స్ ట్రోమితార్పన్ హైడ్రోబ్రోమైడ్ టొంజెస్, డైక్లోఫినాక్, డైఫెన్ హైడ్రామైన్ క్యాప్సూల్స్, పారాసిటిమాల్, సోడియం క్లోరైడ్ నాజల్ స్ర్పే, ఆక్సిమెటాజోలైన్ నాజల్ సొల్యూషన్, కిటొకోనాజోల్ షాంపూ, లాక్టులోస్ సొల్యూషన్, బెంజోల్ పెరాక్సైడ్, కాలమైన్ లొషన్, జైలోమిటాజోలైన్ హైడ్రోక్లైడ్, బిసాకొడిల్.. ట్యాబ్లెట్లను మెడికల్ షాపుల్లో ప్రిస్ర్కిప్షన్ లేకుండా కొనుగోలు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news