సామాజిక న్యాయ భేరి పేరిట నిన్నటి వేళ బస్సు యాత్రను చేపట్టారు బీసీ మంత్రులు. బీసీ మంత్రులతో పాటు మైనార్టీ వర్గానికి చెందిన వారు, ఇంకా చెప్పాలంటే ఇతర నాయకులూ అంతా కదిలి వచ్చారు. శ్రీకాకుళం కేంద్రంగా బస్సు యాత్ర ఆరంభం అయింది. అరసవల్లి క్షేత్రాన తొలి పూజలు చేశాక యాత్ర ఆరంభం అయింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ..జగన్ తోనే సామాజిక న్యాయం సాధ్యం అయిందని తెలిపారు. పథకాలు అమలు వెనుక ఉన్న స్ఫూర్తిని అర్థం చేసుకుని, అందివచ్చిన ఆర్థిక ప్రయోజనాలను వినియోగించుకోవాలని కోరారు. మంత్రుల రాకతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం ఒకటి కనిపించింది. ఎప్పటిలానే దివంగత నేత వైఎస్సార్ కు అంజలి ఘటించాక ఈ కార్యక్రమం మొదలు అయింది.
ఇక ప్రారంభ సభలో మంత్రులు ఏం మాట్లాడారంటే…
ఆ రోజు మాదిరిగా ఇవాళ లేదని, పథకాలు అందించే క్రమంలో నిష్పక్షపాత వైఖరి ప్రదర్శితం అవుతోందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని, ఆ విధంగా పథకాల అమలు చేపడుతున్నామని, ఇందులో వేరొక ఆలోచనకు తావేలేదని అన్నారు. ముఖ్యంగా పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారిత దిశగా కుల వృత్తి చేసుకునే బడుగు జీవులు తమ జీవన నేపథ్యాలను మెరుగు పరుచుకోవాలని పిలుపు నిచ్చారు. ఇప్పటి దాకా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు పంపిణీ చేశామని,ఇందులో ఆ రో జు మాదిరిగా మధ్యవర్తుల ప్రమేయం ఏమీ లేదని , నేరుగా లబ్ధిదారుల ఎకౌంట్లకే వాటిని జమ చేసి మేలు చేస్తున్నామని అన్నారు.
రద్దయిన సభ
విజయనగరంలో మాత్రం సభ వర్షం కారణంగా రద్దయింది. దీంతో బస్సు యాత్ర కు వచ్చిన మంత్రులు సభలో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. ఇవాళ మాత్రం రాజమండ్రిలో సభ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయని ప్రాథమిక సమాచారం. మంత్రులంతా ముక్త కంఠంతో జగన్ సర్కారు చేసిన మేలును వివరించేందుకే ఎక్కువ
ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేవిధంగా రాజకీయ విమర్శలు కన్నా తాము చేసిన మేలు వివరిస్తున్న తీరు బాగుందని చాలా మంది వైఎస్సార్ అభిమానులు కితాబు ఇస్తున్నారు.
ప్రాధాన్యం ఇస్తున్నారు. అదేవిధంగా రాజకీయ విమర్శలు కన్నా తాము చేసిన మేలు వివరిస్తున్న తీరు బాగుందని చాలా మంది వైఎస్సార్ అభిమానులు కితాబు ఇస్తున్నారు.