ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ సంపదని బలవంతంగా లాక్కోకూడదు. అది మహా పాపం. ఇటువంటి తప్పులు చేసే వాళ్ళ జీవితంలో ఆనందాన్ని అనుభవించలేరు. లక్ష్మీదేవికి ఇలాంటి వాళ్ళ మీద ఆగ్రహం కలుగుతుంది. దోపిడీ చేసి డబ్బులు సంపాదించే వాళ్ళ ఆస్తి చాలా త్వరగా నాశనం అయిపోతుంది. అలాంటి వాళ్ళు ఎంత ధనవంతులైనా కూడా క్రమంగా పేదరికం వచ్చేస్తుందని గరుడ పురాణం చెప్తోంది. అలానే లక్ష్మీదేవి శుభ్రంగా లేని ఇళ్లల్లో ఉండదని అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని గరుడ పురాణం చెప్తోంది కాబట్టి ఎప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదే విధంగా రాత్రిపూట భోజనం అయ్యాక తినేసిన పాత్రలని శుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత నిద్రపోవాలి ఆ పాతల్ని అలా వదిలేస్తే దురదృష్టం కలుగుతుంది. అలానే మితిమీరిన కోపం వల్ల వ్యక్తి జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు అని గరుడ పురాణం చెప్తోంది.
ప్రతి విషయంలోనూ అరిచే వారి ఇంట పేదరికం వస్తుందని పేదరికానికి ముఖ్య కారణం అదేనని గరుడ పురాణం అంది. కొంతమందికి ఎప్పుడూ ఎక్కువగా పళ్ళు కొరకడం, గోళ్లు కొరకడం అలవాటు ఉంటుంది. ఇటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు. ఇలాంటి అలవాట్ల వల్ల చేతిలో డబ్బు ఉండదు కాళ్లు ఏడ్చడం కూడా మంచిది కాదు కాళ్లు ఈడుస్తూ నడిచే వ్యక్తుల జీవితంలో ఎప్పటికీ పురోగతి ఉండదు.