పులియబెట్టిన ఆహారాలు తింటున్నారా.. నిపుణులు మాటేంటంటే..

-

ఇడ్లీ, దోశలు తినడం అంటే తెలుగు వాళ్లకు భలే ఇష్టం. రోజువారి టిఫెన్స్ లో ఎప్పుడూ ఇవే ఉంటాయి. వీటిని పులియబెట్టి చేస్తారు.. ముందు రోజు గ్రైండ్ చేసి..మరుసటి రోజు వాడుకుంటారు.. అలా ఓ రాత్రి అంతా.. పిండి పులస్తుంది. పిండి అలా అయితేనే.. దోశలు, ఇడ్లీలు మెత్తగా వస్తాయి. మనం అవి పులవాలని అదే పనిగా.. సోడా ఉప్పు కూడా వేస్తాం. అయితే ఇడ్లీ, దోశలు తినటం ఆరోగ్యానికి మంచిది కాదని నాచురోపతి వైద్యులు అంటారు.. ఎందుకు అవి పాలిష్ పట్టిన బియ్యం, రవ్వతో చేస్తారు కాబట్టి.. మీరు కానీ పాలిష్ లేని వాటితో ఈ పిండి చేసుకుని పులియబెట్టుకుని తిన్నారంటే.. ఇదే మంచి ఆహారం అవుతుంది తెలుసా..?
ఆహారాన్ని పులియబెట్టడాన్ని కిణ్వ ప్రక్రియ అంటారు. ఇందులో ఈస్ట్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పులియబెట్టిన తర్వాత తయారుచేసిన పిండి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. ఇందులో ఉండే బ్యాక్టీరియాను ప్రోబయోటిక్స్ అంటారు. ఇలా పులియబెట్టిన ఆహారం తినటం ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో చూద్దామా..!

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

పులియబెట్టిన ఆహారాన్ని తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది. ఇది బాడీలో యాక్టీవ్ గా ఉంటే.. అసలు ఏ రోగాలు దరిచేరవు. దగ్గు, జలుబు లాంటివి వెంటనే తగ్గిపోతాయి.

బరువు తగ్గిస్తుంది

పులియబెట్టిన ఆహారాన్ని సరైన మార్గంలో తీసుకుంటే సులువుగా బరువు తగ్గుతారు. మనం పైన చెప్పినట్లుగా ఇడ్లీల పిండి చేసుకుని..డైలీ ఇడ్లీలు తింటే.. కడుపునిండిన ఫీల్ వస్తుంది. టిఫెన్ ఎక్కువగా తింటే.. లంచ్ తక్కువగా తీసుకోవచ్చు. అవును.. బరువు తగ్గాలనుకునేవారు.. టిఫెన్ ఎక్కువ తినాలి.. లంచ్ తక్కువగా తీసుకోవాలని డైట్ నిపుణులు ఎప్పుడూ చెప్తుంటారు. కాబట్టి ఈ టెక్నిక్ ను ట్రై చేయొచ్చు.

జీవక్రియలో మెరుగుదల

పులియబెట్టిన ఆహారాలు తేలికగా, సులభంగా అరుగుతాయి. వీటిని తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలోని యాంటీ-ఆక్సిడెంట్ల అవసరాన్ని తీరుస్తాయి. అంతేకాదు పులియబెట్టిన ఆహారాల ద్వారా శరీరానికి విటమిన్ B-12 పుష్కలంగా లభిస్తుంది.
 పులియబెట్టిన వాటిని తయారుచేసేటప్పుడు తక్కువ నూనె ఉపయోగించాలి. ఎక్కువ నూనె ఉపయోగించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. పులియబెట్టిన ఆహారాలలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పెరుగులో ఉంటుంది. మ‌న శ‌రీరంలో మంచి బాక్టీరియాను పెంచుకోవాలంటే చ‌క్కెర‌ను బాగా త‌క్కువ‌గా తీసుకోవాలి. వీలుంటే అసలు పూర్తిగా మానేయాలి. చ‌క్కర వ‌ల్ల శ‌రీరంలో మంచి బాక్టీరియా న‌శించి చెడు బాక్టీరియా పెరుగుతుంది. ఇంకా చాలా దుష్ప్ర‌భావాలు ఉన్నాయి. వైట్ ప్రొడెక్ట్స్ అన్నీ ఆరోగ్యానికి హాని కలిగించేవే.. ఉప్పు కూడా మంచిది కాదు. బరువు తగ్గాలనుకునే వారు ఉప్పు పూర్తిగా మానేసి చూడండి..మీలో మంచి మార్పులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version