అప్పుడప్పుడు గుండెల్లో మంట వస్తోందా..? అయితే ఈ ఇంటి చిట్కాలను అనుసరించండి..!

-

ఒక్కొక్కసారి హటాత్తుగా గుండెల్లో మంట వస్తుంది. ఇలా వచ్చినప్పుడు అంతా కూడా చేదుగా ఉంటుంది. దానితో పాటు గ్యాస్, వికారం, బ్లోటింగ్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి కలుగుతాయి. ఎప్పుడైనా ఎక్కువగా ఆహారం తీసుకునేటప్పుడు ఈ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఎసిడిక్ స్టమక్ జ్యూసులు కారణంగా గుండెలో మంట అనేది కలుగుతూ ఉంటుంది.

దీని మూలంగానే ఎక్కువ గుండెల్లో మంట వస్తుంది. ఫ్యాట్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ను తీసుకునేటప్పుడు ఈ సమస్య కలిగే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గర్భిణులకు కూడా గుండెల్లో మంట ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే కచ్చితంగా గుండెలో మంట సమస్య నుండి బయట పడవచ్చు. మరి ఇక ఆ ఇంటి చిట్కాల గురించి చూద్దాం.

బేకింగ్ సోడా:

బేకింగ్ సోడా గుండెల్లో మంటను త్వరగా తగ్గిస్తుంది. దీనికోసం మీరు ఎలా అనుసరించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాసు నీళ్ళలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని కలపాలి. ఇందులో కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం వేసుకోవచ్చు. ఇలా రెండు మూడు సార్లు రోజుకి తీసుకుంటే తక్షణ రిలీఫ్ మీరు పొందొచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్:

గుండెల్లో మంట కలిగితే ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా తీసుకోవచ్చు. ఇది బాగా జీర్ణం అయ్యేటట్టు చేస్తుంది. అలానే ఈ సమస్య నుండి బయట పడుచ్చు.

ఒక టేబుల్ స్పూన్ అన్ ఫిల్టర్డ్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను గోరువెచ్చని నీళ్లలో వేసుకుని కొద్దిగా తేనె కలుపుకొని మీరు ఆహారం తీసుకునే ముందు తాగండి. ఇది కూడా మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది.

అల్లం:

అల్లం తో కూడా గుండెలో మంట సమస్యను తొలగించుకోవచ్చు. అల్లం తీసుకోవడం వల్ల ఇంఫ్లమేషన్ సమస్య కూడా తగ్గుతుంది. 1 స్పూన్ అల్లం తురుముని ఒక కప్పు మరిగించిన నీళ్లలో వేసి కొంచెం సేపు అలా వదిలేసి ఆ తర్వాత దీనిని తాగండి. దీని వల్ల కూడా మీకు గుండెల్లో మంట సమస్య తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version