తెలుగు సినీ ఇండస్ట్రీ ఈ రోజున శోభసంద్రంలో మునిగిపోయింది. అందుకు కారణం ప్రముఖ సీనియర్ నటుడైన కృష్ణంరాజు మరణించడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రం అయింది. ఈరోజు తెల్లవారుజామున అనారోగ్య సమస్యతో కృష్ణంరాజు కన్నుమూశారు. దాదాపుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి కృష్ణంరాజు 50 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక రెబల్ స్టార్ గా తన ఇమేజ్ ను సైతం పదిలం చేసుకున్నారు. తన నటనతో డైలాగులతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని ఎంతోమంది ఫాన్స్ ని సంపాదించుకున్నారు కృష్ణంరాజు.
ఇక రాజకీయపరంగా కూడా తనదైన శైలిలో మార్క్కును చాటుకొని కేంద్రమంత్రి హోదాలో కూడా పనిచేశారు. ఇక అసలు విషయంలోకి వెళితే కృష్ణంరాజు వ్యక్తిగత జీవితంలో రెండు వివాహాలు చేసుకున్న సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి అని చాలా తక్కువ మందికి తెలుసు. అయితే ఆయన మొదటి భార్య ఎవరు? రెండో వివాహం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? వాటికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కృష్ణంరాజు మొదటి భార్య సీతాదేవి ని వివాహం చేసుకున్నారు. అయితే వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. 1995లో అనుకోకుండా ఒక కారు ప్రమాదంలో సీతా దేవి మరణించింది. ఆ టైంలో కృష్ణంరాజు సీతాదేవిని మర్చిపోలేక కొన్ని సంవత్సరాల పాటు చాలా డిప్రెషన్ లోకి వెళ్లారట. అలా కృష్ణంరాజును చూసిన బంధువులు తను ఈ బాధ నుంచి బయటపడడానికి రెండో వివాహం చేసుకోమని సలహా ఇచ్చారట. అయితే మొదట కృష్ణంరాజు రెండో వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదట. అయితే తన బంధువుల సలహా మేరకు రెండో వివాహం చేసుకోవడం జరిగింది కృష్ణంరాజు. అలా శ్యామలాదేవిని కృష్ణంరాజు వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు కూడా జన్మించారు. ఇక వీరితో పాటు మరొక అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నారు. అలా మొదటి భార్య మరణం తర్వాత రెండవ వివాహం చేసుకున్నారు కృష్ణంరాజు.