చూయింగ్‌ గమ్‌ తింటే ఎన్ని కాలరీలు ఖర్చు అవుతాయో తెలుసా..?

-

చిన్నప్పుడు చూయింగమ్‌ అంటే మనందరికీ ఒక చిరుతిండి. రూపాయికే వచ్చేస్తుంది. ఎంతసేపు అయినా నములుకోవచ్చు.. అంతే తెగ తిని ఉంటారు కదా..! అయితే చూయింగమ్‌ తిన్నప్పుడల్లా అందరూ అనేమాట..మింగితే పేగులకు చుట్టుకుపోతుంది అని. మనం కూడా నిజమే అని నమిలినంత సేపు నమిలి బయటపడేసే వాళ్లం.. అయితే చూయింగ్ గమ్ తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు. చూయింగ్ గమ్ నమలడం వల్ల నష్టాలున్నాయా.. లాభాలున్నాయా.. అనే విషయంపై పరిశోధనలు చేసి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టారు.

చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చువుతాయి. అది కూడా కేవలం షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని నిపుణలు అంటున్నారు. షుగర్ ఫ్రీ చూయింగమ్‌ను గంట నమిలితే 11 కేలరీలు ఖర్చవుతాయట. అయితే.. వర్కవుట్స్ చేస్తూ చూయింగ్ గమ్ నమలితే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయి. అంతే కాకుండా 40 ఏళ్లు దాటిన వారు చూయింగ్ గమ్ నమలడం వల్ల చాలా ప్రయోజనాలను ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది.

చూయింగ్ గమ్‌ను మింగేస్తే.

చూయింగ్‌గమ్‌ను మింగేస్తే… పేగులకు చుట్టుకుపోతుందని చాలా మంది భయపడుతుంటారు. అయితే అది నిజం కాదని, మానవ శరీరం చూయింగ్ గమ్‌ను జీర్ణించుకోలేదని, దాన్ని మింగడం వల్ల పేగులకు ఎటువంటి సమస్య రాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చూయింగ్ గమ్‌లను నమిలి ఊసేయకుండా మింగేస్తే మాత్రం అవి పేగుల్లో ఆటంకాలు సృష్టిస్తుందట. చూయింగ్ గమ్‌లు చాలా వరకు తియ్యగా ఉంటాయి. వాటిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. చక్కెరతో చేసిన చూయింగ్ గమ్ దంతాలకు హాని కలిగిస్తుంది. ఇది కావిటీలకు కూడా దారి తీస్తుంది.

షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమలడం వల్ల కేలరీలు ఖర్చటినప్పటికీ.. అది కొద్ది పరిమాణంలో మాత్రమే. ఇది దంతాలను శుభ్రం చేయడమే కాకుండా దవడలకు వ్యాయామంగా ఉపయోగపడుతుంది. అయితే చూయింగ్ గమ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపుబ్బరం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి మంట వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇక ఇది తినాలా వద్దా..తింటే ఎంత వరకూ తినాలి అనేది మీ ఇష్టం.. అధ్యయనాలు అయితే పై విషయాలు చెప్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Exit mobile version