ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేవారు..ఊరు సంగతి ఏమో కానీ..నోరు మంచిదైతేనే..ఆరోగ్యం మంచిదవుతుంది. సర్వరోగాలకు టోల్ గేట్ నోరే మరీ..నోరు శుభ్రంగా లేదంటే..ఎన్ని అనారోగ్యసమస్యలు వస్తాయో తెలుసా. మనం అనుకుంటాం..ఏముంది క్లీన్ గా లేదంటే..కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అంతే అని..అలా అనుకుంటే పొరపాటే..గుండెజబ్బులు, ఛాతీ ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ అబ్బో ఇలా చెప్పుకుంటే పోతే పెద్దపెద్ద జబ్బులే ఉన్నాయండి.
గుండెకు కీడు చేసే ఇన్ఫెక్షన్లు నోరు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు అక్కడి నుంచి గుండెకు పాకి జబ్బును కలగజేస్తాయట. అంతేకాదు నోరు పరిశుభ్రంగా లేకపోతే రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనమవుతుంది. ఫలితంగా అనేక జబ్బులకు అదే కారణమవుతుంది. నోరు శుభ్రంగా లేకపోవటం పరోక్షంగా డయాబెటీస్, ఆస్టియోపోరోసిస్ ఇంకా అనేక శ్వాసకోశ వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కొన్ని అరుదైన క్యాన్సర్లకు కూడా కారణం..నోరు క్లీన్ గా లేకపోవటమే. అందుకే ఎప్పటికప్పుడు నోరుని శుభ్రంగా ఉంచుకోవాలి.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.
కరోనా కారణంగా నోటి సమస్యలకు చికిత్స చేయించుకోవడం బాగా తగ్గిందట. ఫలితంగా పెరుగుతున్న ముప్పు దాంతో మునుపు తేలిగ్గా నివారితమైపోయే చాలా జబ్బులు ముదిరి ఇప్పుడు భారీ ప్రమాదమే తలపెట్టనున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ప్రాథమికంగా చేసే స్క్రీనింగ్‌తో లేదా చిన్నపాటి సమస్య ఫస్ట్ దశలోనే ఉన్నప్పుడు చికిత్స చేస్తే..సమస్య పెద్దదికాకుండా చేయొచ్చు. మన దేశంలో 2020 మార్చి నుంచి 2021 మార్చి నాటికి దంతవైద్యుల దగ్గరికి వచ్చే చిన్నారుల శాతం 34% నుంచి 10% కి పడిపోయింది. యుక్తవయస్కుల విషయానికి వస్తే… చికిత్సకు వచ్చే పెద్దవారి సంఖ్య గత రెండేళ్లలో 32.6% నుంచి 23.6%కు పడిపోయిందట.
కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కొత్త సమస్యలు తెచ్చుకోకుండా ఉండండి. ఉన్నవే బోలెడున్నాయి..ఈ వేవ్స్ తోనే సగం జీవితం అయిపోతుందంటే..ఇంకా ఈ నోరు కూడా క్లీన్ పెట్టుకోకుండా మనమే కొత్తసమస్యలకు దారి ఇచ్చినవాళ్లమవుతాం. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయటం, ఏదైనా తిన్నవెంటనే పుక్కిలించి ఊయటం, పళ్లలో క్వావిటీ సమస్య ఉంటే వెంటనే చికిత్స చేయించుకోవటం వంటివి చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.