వామ్మో.. గజరాజు ఎంత పని చేసిందో తెలుసా?

-

ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాయి. అందులోనూ జంతువులకు సంబందించిన వీడియోలు కూడా ఉంటాయి.కొన్ని రకాల జంతువులు చేసే అల్లరి పనులు చూసి అంతా నవ్వుకుంటారు. అందుకే ఇటువంటి వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా.. ఒక ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అసలు ఆ ఏనుగు ఏమి చేసిందో ఇప్పుడు ఒకసారి చుద్దాము..

మనుషులకు దురద పుడితే ఏదొక దానితో వీపు గోక్కుంటారు.అదే ఏనుగుకు దురద పెడితే ఏం చెయ్యాలో తెలియలేదు.దీంతో రోడ్డుపై వెళ్తున్న ఓ కారును ఆపింది. ఆ కారు ఆగగానే గజరాజు ఆ కారు మీద ప్రతాపం చూపెట్టడం మొదలుపెట్టింది. దాంతో ఆ కారు మొత్తం డ్యామేజ్ అయింది. కారు ముందు భాగం ఏనుగు దెబ్బకు నుజ్జునుజ్జు అయింది. వీడియోని గమనిస్తే ఏనుగు మొదట కారు ముందు ఎడమవైపు ఉన్న చక్రం మీద ఎక్కేందుకు ప్రయత్నించింది. ఎంతలా ప్రయత్నించినా చక్రాన్ని ఎక్కడం ఏనుగుకు వీలుపడలేదు. దీంతో అలసిపోయిన ఆ గజరాజు కారు ముందుకు వెళ్లి బానెట్ పైకి ఎక్కాలని అనుకుంది దాని దెబ్బకు ఆ కారు పూర్తిగా పాడైపోయింది.

ఇక ఆ కారు బానెట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక చేసేదేం లేక ఆ గజరాజు కారు పైకి ఎక్కి.. బంపర్ విరగ్గొట్టింది. దీంతో బెంబేలెత్తిపోయిన ఆ కారు డ్రైవర్ తన కారును వెనక్కి తీసుకొని వెళ్ళాడు..ఏనుగు కారును డ్యామేజ్ చేసిన ఫన్నీ వీడియోని ట్విటర్‌లో షేర్ చేయగానే ఈ వీడియో వైరల్ అయ్యింది. ఒకటి కాదు రెండు కాదు.. వీడియోకి మిలియన్లలో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చి పడ్డాయి. కామెంట్లకు అయితే లెక్కే లేకుండా పోయింది.

ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన ఫన్నీ కామెంట్ చేస్తూ షేర్ చేస్తున్నారు. కొంతమంది ఈ సీన్ గురించి ఇన్సూరెన్స్ కంపెనీకి వివరించాలని కామెంట్ చేయగా… ఇంకో కొందరు మాత్రం ఏనుగు నిజంగా ఇలా చేస్తుందా అని షాక్ లో ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కోడుతుంది..

 

Read more RELATED
Recommended to you

Latest news