ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమాలివే..!

-

విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న ఎన్టీఆర్ ..తెలుగు వారి ఆరాధ్యుడు అని చెప్పొచ్చు. కథా నాయకుడిగానే కాక నాయకుడిగాను ప్రజల మెప్పు పొందిన వ్యక్తి. తెలుగు వారి ఆత్మ గౌరవ పతాకగా నిలిచిన సీనియర్ ఎన్టీఆర్..సినిమా రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ విజయం సాధించారు. ఇక ఆయన నట, రాజకీయ వారసుడిగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చి కొనసాగుతున్నారు.

బాలయ్య ప్రస్తుతం ప్రముఖ సినీ హీరోగా ఉంటూనే ఏపీలోని హిందూపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇకపోతే బాలయ్య ఆయన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో పలు సినిమాలు చేశాడు. ఆ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాలయ్యకు తన తండ్రి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. ఎన్టీఆర్ ను ఆయన తండ్రిగానే కాక గురువుగా భావిస్తుంటారు. ఎన్టీఆర్ హీరోగా విజయాలు అందుకున్న సమయంలోనే ఆయనకు దర్శకత్వంపైన మక్కువ కలిగింది. ఇతర దర్శకులు చేయని ఎన్నో సాహసాలు ఆయన దర్శకుడిగా చేశారు. అలా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వం వహించిన సినిమాలు చాలానే ఉన్నాయి.

ఆయన ఒక వైపున దర్శకత్వం వహిస్తూనే మరో వైపున అందులో నటించారు కూడా. అలా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఆయన తనయుడు బాలయ్య కూడా నటించడం విశేషం.

బాలయ్య తన 14 ఏటనే సినీ రంగ ప్రవేశం చేశారు. అది కూడా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన చిత్రంతో.. ఆ చిత్రమే ‘తాతమ్మ కల’. ఇందులో బాలనటుడిగా బాలకృష్ణ నటించాడు. ‘దాన వీర శూర కర్ణ’ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం వహించగా, ఇందులో అభిమన్యుడిగా బాలయ్య నటించారు. ‘అక్బర్ సలీమ్ అనార్కలి’ పిక్చర్ కు కూడా ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీఆర్ ‘అక్బర్’గా, బాలయ్య ‘సలీం’గా నటించారు. ‘శ్రీమద్విరాట పర్వము’ సినిమాకూ ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు. ఇందులో ఎన్టీఆర్ తన తనయుడితో కలిసి నటించారు.

‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర కళ్యాణం’ చిత్రంలో వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్, నారదుడిగా బాలయ్య నటించారు. ‘శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి’ చిత్రంలో బాలయ్య ‘సిద్ధుడి’ పాత్రలో నటించగా, టైటిల్ రోల్ సీనియర్ ఎన్టీఆర్ ప్లే చేశారు. అలా ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో బాలయ్య కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version